Akhanda2: బాలయ్య అఖండ2 మూవీ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనా.. ఏమైందంటే?

  • December 6, 2023 / 11:36 AM IST

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించింది. యూత్ ను సైతం ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత బాలయ్యకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. అయితే అఖండ2 మూవీ ఈ ఏడాది ఆగష్టునెలలో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. బాలయ్య ప్రస్తుతం బాబీ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత బోయపాటి శ్రీను సినిమాతో బిజీ కానున్నారని తెలుస్తోంది.

బాలయ్య సినిమా తర్వాతే బన్నీ సినిమాతో బోయపాటి శ్రీను బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. అఖండ2 సినిమా సెట్స్ పైకి వెళితే మాత్రం ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. బాలయ్య అఖండ2 ప్రాజెక్ట్ కు నిర్మాత ఎవరనే ప్రశ్నకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ ను నిర్మించే ఛాన్స్ కోసం చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

బాలయ్య కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది. అఖండ2 (Akhanda2) సినిమా కథ, కథనం కొత్తగా ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్య ఇతర భాషల మార్కెట్ పై దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో క్రేజ్ ను పెంచుకుంటున్నారని తెలుస్తోంది. బాలయ్య మాస్ ప్రాజెక్ట్ లలో నటిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో పక్కా బ్లాక్ బస్టర్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరుగుతోంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus