Akhanda movie: ‘అఖండ’ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘అఖండ’ చిత్రం గురించి నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ నటించిన గత 3 సినిమాలు నిరాశపరచడంతో.. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించి 18 రోజుల షెడ్యూల్ ఒకటి మిగిలుందట. అది పూర్తయితే ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేస్తారు. ఇక జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో రేపు సాయంత్రం 4 : 36 నిమిషాలకు ‘అఖండ’ నుండీ ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నట్టు కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో ప్రకటించారు నిర్మాతలైన ‘ద్వారకా క్రియేషన్స్’ వారు..!

ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయని వినికిడి. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సారధ్యంలో తెరకెక్కిన ఫైట్ సెక్వెన్స్ లు ఆకట్టుకుంటాయట.అలాగే ఫారెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి చాలా బాగా వచ్చిందని తెలుస్తుంది.దీని చిత్రీకరణ కోసం కర్ణాటక దగ్గర దండేలి అరణ్యాలకు వెళ్ళారట ‘అఖండ’ టీమ్.అక్కడ చాలా అడ్వెంచర్ లు చేసినట్లు తెలుస్తుంది. హీరోయిన్ ప్రగ్య తో కలిసి బాలకృష్ణ..

ఈ అడ్వెంచర్ ఎపిసోడ్ లలో పాల్గొన్నారట. స్టంట్ శివ సారథ్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించినట్టు తెలుస్తుంది. సినిమాలో ఇవి హైలైట్ కానున్నాయట. రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్ వంటివి చిత్రీకరించినట్టు ఇన్సైడ్ టాక్. ఇవి కచ్చితంగా థ్రిల్ చేసే విధంగా ఉండబోతున్నాయి అని ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus