మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి రెండు సినిమాలలో నటిస్తున్నట్టు క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాల షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఈ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో క్లారిటీ లేదు. అయితే చిరంజీవి సినిమాలకు ఊహించని మరో సమస్య వచ్చిందని తెలుస్తోంది. చిరంజీవి సినిమాలకు హీరోయిన్ల ఎంపిక విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. చిరంజీవి 156 మూవీకి డైరెక్టర్ ఫిక్స్ కావడంతో పాటు హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉండగా చిరంజీవి 157 సినిమాకు మాత్రం ఎక్కువమంది హీరోయిన్లు అవసరమని తెలుస్తోంది.
చిరంజీవి ఇప్పటికే చాలామంది హీరోయిన్లతో నటించిన నేపథ్యంలో ఆయనకు జోడీగా కొత్త హీరోయిన్ ను ఎంపిక చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హీరోయిన్ల ఎంపిక ఫైనల్ అయిన తర్వాతే ఈ సినిమాల షూట్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. మెగాస్టార్ చిరంజీవికి కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భోళా శంకర్ మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో చిరంజీవి తర్వాత సినిమాతో కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మల్టీస్టారర్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ‘చిరంజీవి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి తన రేంజ్ ను మరింత పెంచే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సంచలన విజయాలను సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు. చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ ల జాబితాలో క్రేజీ డైరెక్టర్లు ఉన్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చిరంజీవి నవ్యత ఉన్న కథాంశాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. చిరంజీవి సినిమాలలో కొన్ని సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్నాయి. చిరంజీవి, పవన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!
సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!