సినీ పరిశ్రమలో అవకాశాలు రావడమే చాలా కష్టం. ఒకవేళ అవకాశం వచ్చినా.. రిజల్ట్ ఆశించినట్టు రాకపోతే.. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. చాలా మంది హీరోయిన్లకి మంచి అవకాశాలు వచ్చాయి. కానీ తర్వాత కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడంతో వాళ్ళు ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. అలాంటి వారిలో సంతోషి శ్రీకర్ ఒకరు. 2004 లో ఈమె టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తక్కువ టైంకే ఫేడౌట్ అయిపోయింది అని చెప్పాలి.
2004 లో తేజ దర్శకత్వంలో రూపొందిన ‘జై’ సినిమాలో హీరోయిన్ గా నటించింది సంతోషి శ్రీకర్. నవదీప్ హీరోగా పరిచయమవుతూ చేసిన ఆ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. దీంతో ఆమెకు హీరోయిన్ గా ఛాన్సులు రాలేదు. కానీ ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో హీరోయిన్ త్రిష ఇంట్లో పని మనిషిగా నటించింది. అలాగే శ్రీహరి హీరోగా నటించిన ‘ఒక్కడే’ , పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బంగారం’, ‘ఢీ’ వంటి క్రేజీ సినిమాల్లో నటించింది. కానీ తర్వాత ఆమె టాలీవుడ్లో కనిపించలేదు.
తమిళంలో 2 ,3 సినిమాలు చేసినా అవి సక్సెస్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈమె తన ఇల్లు తాకట్టు పెట్టి మరీ బిజినెస్ చేస్తుందట. ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. తాను పుట్టింది విజయవాడలో అయినప్పటికీ పెరిగిందంతా చెన్నైలో అని ఆమె తెలియజేసింది. అంతేకాదు ఇప్పటికీ ఈమెకు తెలుగులో మాట్లాడటం పూర్తిగా రాదు అని తెలిపి షాకిచ్చింది. మరి బిజినెస్ పరంగా (Santhoshi Srikar) ఈమె సక్సెస్ సాధించి మంచి పొజిషన్ కి వెళ్తుందేమో చూడాలి..!
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!