Anaganaga Oka Raju Collections: ‘అనగనగా ఒక రాజు’… రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది
- January 28, 2026 / 11:56 AM ISTByPhani Kumar
నవీన్ పోలిశెట్టి హీరోగా మారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది ఈ సినిమా.
Anaganaga Oka Raju Collections
టీజర్, ట్రైలర్స్ వంటివి ఆకట్టుకోవడం.. అలాగే నవీన్ పోలిశెట్టి వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉండటం పైగా ప్రమోషనల్ కంటెంట్లో సంక్రాంతి పండుగ వైబ్స్ ఉండటంతో.. ఈ సినిమా పై మొదటి నుండి అంచనాలు పెరిగాయి.

మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. పండుగ సెలవులు ముగిసినప్పటికీ ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది.రిపబ్లిక్ డే హాలిడే కూడా ఈ సినిమాకి బాగా కలిసొచ్చినట్టు అయ్యింది. ఒకసారి 13 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 11.61 cr |
| సీడెడ్ | 3.80 cr |
| ఉత్తరాంధ్ర | 6.72 cr |
| ఈస్ట్ | 3.41 cr |
| వెస్ట్ | 1.91 cr |
| గుంటూరు | 2.68 cr |
| కృష్ణా | 2.23 cr |
| నెల్లూరు | 1.32 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 33.68 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.89 cr |
| ఓవర్సీస్ | 8.43 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 45 కోట్లు |
‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) సినిమాకి రూ.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.28 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 13 రోజులు పూర్తయ్యేసరికి రూ.45 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.85.8 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు రూ.17 కోట్ల లాభాలు అందించింది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది
















