నవీన్ పోలిశెట్టి హీరోగా మారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది ఈ సినిమా.
టీజర్, ట్రైలర్స్ వంటివి ఆకట్టుకోవడం.. అలాగే నవీన్ పోలిశెట్టి వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉండటం పైగా ప్రమోషనల్ కంటెంట్లో సంక్రాంతి పండుగ వైబ్స్ ఉండటంతో.. ఈ సినిమా పై మొదటి నుండి అంచనాలు పెరిగాయి.

మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 5.53 cr |
| సీడెడ్ | 1.82 cr |
| ఉత్తరాంధ్ర | 2.68 cr |
| ఈస్ట్ | 1.30 cr |
| వెస్ట్ | 0.93 cr |
| గుంటూరు | 1.16 cr |
| కృష్ణా | 1.19 cr |
| నెల్లూరు | 0.64 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 15.25 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.14 cr |
| ఓవర్సీస్ | 4.09 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 20.48 కోట్లు |
‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) సినిమాకి రూ.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.28 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా రూ.20.48 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.37.5 కోట్లు కలెక్ట్ చేసింది.
