విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) , తన కెరియర్ ను కొంచెం భిన్నమైన దిశలో డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ‘దొరసాని’ (Dorasani) సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన ఆనంద్, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ (Middle Class Melodies) , ‘పుష్పక విమానం’ (Pushpaka Vimanam) , ‘హైవే’ (Highway) , ‘బేబీ’ (Baby) , ‘గంగం గణేశా’ (Gam Gam Ganesha) వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. వీటిలో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. కానీ, అతని కెరియర్ కు నిజమైన బూస్ట్ ఇచ్చింది ‘బేబీ’. ఈ సినిమా ఆనంద్ దేవరకొండకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా మారింది.
‘బేబీ’ తర్వాత ఈ ఏడాది వచ్చిన ‘గంగం గణేశా’ ఆశించినంతగా ఆకట్టుకోకపోయినా, ఆనంద్ తనకంటూ కొత్త ప్రాజెక్టులను పట్టుకున్నాడు. ప్రస్తుతం అతను ‘బేబీ’ సినిమాలో తనతో జతకట్టిన వైష్ణవి చైతన్యతో ‘డ్యూయెట్’ అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇదే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు కూడా లైన్ లో ఉన్నాయి. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ దర్శకుడు వినోద్ ఆనంతోజుతో మళ్లీ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
ఈ చిత్రం ప్రొడక్షన్ దశలో ఉందని సమాచారం. అలాగే ‘90s’ (90’s – A Middle-Class Biopic) వెబ్ సిరీస్ తో ఫేమ్ సంపాదించిన యువ దర్శకుడు ఆదిత్య హాసన్ తో (Aditya Haasan) కూడా ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు కూడా యూత్ ఫుల్ కాన్సెప్ట్ లతో రూపొందనుండటంతో, యువ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నారు. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందే సినిమా విదేశాలలో చదువు పూర్తి చేసుకున్న యువకుడి కథని ఆధారంగా తీసుకొని ఉంటుందట.
వెబ్ సిరీస్ తరహాలోనే ఆదిత్య ఈ కథను ఆసక్తికరంగా మలుస్తాడని భావిస్తున్నారు. మొత్తానికి, ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) తన కెరియర్ విషయంలో జాగ్రత్తగా ముందుకెళ్తున్నాడు. కంటెంట్ బేస్డ్ సినిమాలు ఎంపిక చేసుకుంటూ, యువతను ఆకట్టుకునే కథలతో సక్సెస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ మూడు ప్రాజెక్టులు సక్సెస్ అయితే ఆనంద్ దేవరకొండ మార్కెట్ మరో లెవెల్ కు వెళుతుంది.