విజయ్ దేవరకొండ తమ్ముడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda). మొదటి సినిమాగా ‘దొరసాని’ (Dorasani) రిలీజ్ అయ్యింది. అది మంచి టాక్ తెచ్చుకుంది. కానీ ఆనంద్ కంటే హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ (Shivathmika Rajashekar) ఎక్కువ మార్కులు కొట్టేసింది. అయినప్పటికీ ఆనంద్ స్టోరీ సెలక్షన్ కి అంతా మెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ (Middle Class Melodies) చేశాడు. అది ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.నటుడిగా ఆనంద్ కి మంచి పేరొచ్చింది.
Anand Deverakonda
అటు తర్వాత ‘పుష్పక విమానం’ (Pushpaka Vimanam) ‘హైవే’ (Highway) వంటి సినిమాలు చేశాడు. అవి ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్లిపోయాయో జనాలకి గుర్తుండకపోవచ్చు. అయితే ‘బేబీ’ (Baby) సినిమా మంచి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆనంద్ కి మార్కెట్ ఏర్పడేలా చేసింది. ఇటీవల వచ్చిన ‘గం గం గణేశ’ (Gam Gam Ganesha) కూడా మంచి టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు.ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ ఎస్.కె.ఎం Sreenivasa Kumar Naidu(SKN) నిర్మాణంలో మరో సినిమా చేయబోతున్నాడు.
అలాగే ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యింది. ఈ సినిమాల కోసం ఆనంద్ రూ.4 కోట్లు పారితోషికం అందుకోబోతున్నారు అని వినికిడి. ‘బేబీ’ తో ఆనంద్ దేవరకొండ నాన్ థియేట్రికల్ మార్కెట్ ఇంప్రూవ్ అయ్యింది. పైగా ‘గం గం గణేశ’ కి మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. అందుకే నిర్మాతలు.. ఆనంద్ అడిగినంత ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. ఇదే టైంలో ఇంకో హిట్ పడితే.. ఆనంద్ రేంజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.