అనన్య నాగళ్ళ (Ananya Nagalla) పరిచయం అవసరం లేని పేరు. ‘షాదీ’ వంటి షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించింది. ‘మల్లేశం’ తో (Mallesham) హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత ‘ప్లే బ్యాక్’ అనే వైవిధ్యమైన సినిమాలో కూడా నటించింది. దీంతో వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.అటు తర్వాత కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది.
ఇప్పుడు అనన్య నాగళ్ళ స్మాల్ స్కేల్ విమెన్ సెంట్రిక్ సినిమాలకు… అంటే రూ.5 కోట్ల బడ్జెట్లో రూపొందే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించుకుంటున్నారు.గత ఏడాది నుండి చూసుకుంటే.. వరుసగా ‘తంత్ర’ (Tantra) ‘పొట్టేల్’ (Pottel) ‘బహిష్కరణ’ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ (Sreekakulam Sherlock Holmes) వంటి 4 ప్రాజెక్టులతో మెప్పించింది. ఇవన్నీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ‘తంత్ర’ సినిమా హిందీ వెర్షన్ అయితే జియో హాట్ స్టార్ లో టాప్ 2 లో ట్రెండ్ అవుతుంది.
అలాగే ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పటికీ టాప్ 5 లో ట్రెండ్ అవుతుంది. అందుకే రూ.5 కోట్ల బడ్జెట్ సినిమాలు తీయాలనుకునే దర్శకనిర్మాతలు అనన్య వైపే మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమవుతుంది. మరోపక్క ప్రస్తుతం అనన్య బాలీవుడ్లో ఓ సినిమా చేస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఏక్తా ఫిలిం ఎంటర్టైన్మెంట్’ సంస్థపై హిమ్మత్ లడుమోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇది కూడా విమెన్ సెంట్రిక్ మూవీ.
ఇందులో అనన్య నాగళ్ళ ఓ గిరిజన యువతిగా మెయిన్ లీడ్లో కనిపించబోతున్నారట. రాకేష్ జగ్గి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘కాంత’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు టాక్. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ రేంజ్ బాలీవుడ్ వరకు వెళ్లడం అనేది చెప్పుకోదగ్గ విషయమే అని చెప్పాలి.