Ananya Panday: అనన్య పాండే రెమ్యునరేషన్ తగ్గించిందట!

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే చివరిగా ‘లైగర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ఈ సినిమాపై అనన్య చాలా ఆశలు పెట్టుకుంది. సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో కొంతకాలం పాగా వేయాలనుకుంది. కానీ ఆమె ప్లాన్స్ అన్నీ బెడిసికొట్టాయి. సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో పాటు అనన్య నటనపై ట్రోలింగ్ జరిగింది. బాలీవుడ్ లో కూడా ఆమె పరిస్థితి అలానే ఉంది.

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో లాంచ్ అయిన అనన్య ఆ తరువాత కొన్ని అవకాశాలు దక్కించుకుంది. ‘గెహ్రాయాన్’ అనే సినిమాతో హిట్ అందుకున్నా.. ఆ సినిమా క్రెడిట్ దీపికా పదుకోన్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం అనన్య బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది. అవి వచ్చే ఏడాదిలో విడుదల కానున్నాయి. అయితే ఈ సినిమాలు ఎప్పుడో ఒప్పుకున్న కమిట్మెంట్స్. అవి తప్ప కొత్తగా అనన్యకు ఎలాంటి అవకాశాలు రావడం లేదట.

ఆమె ఎంతగా ప్రయత్నిస్తున్నా.. మేకర్స్ మాత్రం ఆమెకి ఛాన్సులు ఇవ్వడానికి రెడీగా లేరని టాక్. దీంతో ఆమె ఒక నిర్ణయం తీసుకుందట. త్వరలోనే దాన్ని అమలు చేయడానికి రెడీ అవుతోంది. తన రెమ్యునరేషన్ లో భారీగా కోత విధించిందట. దాదాపు రూ.50 లక్షల వరకు రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు చెబుతున్నారు.

నిజానికి ఈమె ఒక్కో సినిమాకి రూ.80 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అందులో సగానికి పైగానే కట్ చేసుకొని ఇప్పుడు రూ.30 లక్షలు ఇస్తే చాలు అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి ఓకే చెబుతుందట. ఇలా అయినా.. అనన్యాకు ఎవరైనా అవకాశాలు ఇస్తారేమో చూడాలి!

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus