Anasuya: ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సంస్థ పై మండిపడ్డ అనసూయ

అనసూయ భరద్వాజ్.. పరిచయం అవసరం లేని పేరు.మొన్నటి వరకు బుల్లితెర పై స్టార్ యాంకర్ గా రాణించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ మధ్యనే కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగమార్తాండ’ సినిమాలో ప్రకాష్ రాజ్ కోడలి పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో అనసూయ పాత్ర చూస్తే ఎవరికైనా కోపం రావడం ఖాయం.అలా అని అది నెగిటివ్ రోల్ అనుకోవడానికి కూడా లేదు.

అయినా అనసూయలో (Anasuya) ఇలాంటి షేడ్స్ చూడటం కొత్త కాబట్టి…. ఈ పాత్ర గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. ఇక నుండి అనసూయకి ఇలాంటి గ్రే షేడ్స్ ఉన్న పాత్రలు రావడం గ్యారెంటీ అనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో అనసూయ ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల ఈమెకు ఓ చేదు అనుభవం ఎదురైనట్టు తెలిపి అందరికీ షాకిచ్చింది. విషయంలోకి వెళితే.. అనసూయ ప్రముఖ ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ పై మండిపడుతూ పోస్ట్ పెట్టింది.

‘నేను ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ద్వేషిస్తున్నాను.ఇక్కడ దేశీయ ఎయిర్‌లైన్స్‌లో వారు ఆధిపత్యం చెలాయించడం చాలా విచారకరం.వారి సేవల్లో కనీసం నాణ్యత లేదు’ అంటూ అనసూయ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఆమెకు జరిగిన అసౌకర్యం ఏంటి అన్నది మాత్రం ఈ ట్వీట్లో పేర్కొనలేదు. గతంలో కూడా అనసూయ ‘ అలయన్స్.9ఐ విమాన ప్రోటోకాల్ కారణంగా నేను చాలా ఇబ్బంది పడ్డాను.

సీట్స్ మంచివి ఇవ్వలేదు. నేను బుక్ చేసుకున్న సీట్స్ కాకుండా వేరేవి ఇచ్చారు. మాస్క్ లేకుండా ఫ్లైట్ ఎక్కనివ్వలేదు’ అంటూ కూడా ఈమె పెట్టిన కామెంట్స్ అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి. ఇప్పుడు కూడా అనసూయ కామెంట్లు వైరల్ గా మారాయి.


శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus