ఇటీవల ‘లైగర్’ సినిమా రిలీజ్ అవ్వడం.. అది ఫ్లాప్ అవ్వడం.. ఇక్కడ వరకు నార్మల్ గానే ఉంది. కానీ ఈ సినిమా ప్లాప్ అయినందుకు అనసూయ ఏదో పండగ చేసుకుంటున్నట్టు ఓ ట్వీట్ వేసింది. అది కాస్తా వివాదాస్పదం అయ్యింది. 5 ఏళ్ళ క్రితం ‘అర్జున్ రెడ్డి’ టైం లో ఓ చిన్న వివాదం చోటు చేసుకుంది. ఆ టైంలో అనసూయ పెద్ద రచ్చ చేసింది. తర్వాత అంతా అయిపోయింది అనుకుంటే.. ‘అమ్మను తిట్టిన ఉసురు ఊరికే పోదు’ అంటూ శాపనార్ధాల ట్వీట్ వేసింది.
ఇది విజయ్ దేవరకొండ అభిమానులకు అలాగే అనసూయ అంటే ఇష్టం లేని వారికి కోపం తెప్పించింది.దీంతో ‘ఆంటీ’ అంటూ ఆమె పై ఓ రేంజ్లో ట్రోలింగ్ కి దిగారు. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆమె ఓ మంచి పొజిషన్ లో ఉంది. అలాంటామె ఇంకో హీరో సినిమా ఫ్లాప్ అయితే సంతోషించడం అనే పాయింట్ నిజంగానే బాలేదు. కానీ అనసూయ ఎందుకు ఇలా సీరియస్ అవుతుంది అన్న విషయం ఇప్పటికీ ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.
ఇదిలా ఉండగా.. తాజాగా అనసూయ ఓ ట్వీట్ వేసింది. ఇందులో తన పై అసభ్యకరంగా ట్వీట్లు వేసిన వారిపై కేసు పెట్టినట్లు, ఆ కేసు నెంబర్ కూడా ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ‘ఇప్పటివరకు సామాన్యులు లేదా యువత భవిష్యత్తు పాడవకూడదు అనే ఉద్దేశంతో ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇక ఏదైతే అదైంది.నేనైతే కేసు పెట్టేసాను.ప్రస్తుతం ప్రాసెస్ మొదలైంది.. అంటూ ఆమె ఓ ట్వీట్లో పేర్కొంది. దీంతో కొంతమంది అనసూయను క్షమాపణలు కోరడం మొదలుపెట్టారు.
తర్వాత ఆమె ‘నేను ఏ సినిమాని, హీరోని కించపరిచే విధంగా ట్వీట్లు వేయలేదు.. నా అభిప్రాయాన్ని నేను ట్విట్టర్లో పెట్టాను. మీరు నా పై డైరెక్ట్ గా అటాక్ చేశారు’ అంటూ ఆమె ఇంకా మండిపడుతుంది. మరి ముందు ముందు అనసూయ నెటిజెన్లపై ఇంకెలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి..!