‘అల్లు అర్జున్ 20’ నుండీ అనసూయ ఔట్?

అల్లు అర్జున్ ఈ ఏడాది ప్రారంభంలోనే ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా ‘బాహుబలి 1’ కల్లెక్షన్లనే అధిగమించాడు బన్నీ. అంతేకాదు త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ కూడా కంప్లీట్ చేసాడు. ఇక ఈ చిత్రం తర్వాత సుకుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ కావడం విశేషం. ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం కథ ఉంటుందని సమాచారం. ‘శేషాచలం’ అనే పేరుని ఈ చిత్రానికి పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం అనసూయను అనుకున్నారట. అయితే ఈ ఆ పాత్ర చేయడానికి అనసూయ నిరాకరించిందనేది తాజా సమాచారం.

Anasuya out from Allu Arjun movie1

వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తల్లిగా అనసూయ పాత్ర ఉంటుందట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈమె పాత్ర సినిమాకి చాలా కీలకమట. అయితే ఈమెది వేశ్య పాత్రట. అలా అని వల్గర్ గా ఈ పాత్రను సుకుమార్ డిజైన్ చేయలేదట. అయితే అనసూయ మాత్రం ఈ పాత్ర చెయ్యడానికి ఇష్టపడటం లేదనేది తాజా సమాచారం. కాబట్టి ఈమె తప్పుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయట. ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో తమిళ క్రేజీ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండడం విశేషం.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus