Anasuya, Rashmi: అనసూయ, రష్మీ ల హవా అక్కడ కూడా మొదలవుతుందట..!

తెలుగులో స్టార్ యాంకర్లుగా చలామణి అవుతున్న వారి లిస్ట్ చూస్తే అందులో తప్పకుండా అనసూయ, రష్మీ ల పేర్లు ఉంటాయి. ఈ ఇద్దరు భామలు తమ అందంతో బుల్లితెరను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కూడా ‘జబర్దస్త్’ కామెడీ షో తోనే పాపులర్ అయ్యారు. అయితే రష్మీ కంటే కూడా అనసూయ ఓ మెట్టు పైనే ఉంటుంది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఇప్పటికీ అదే గ్లామర్ ను మెయింటైన్ చేస్తుంది అనసూయ.

అంతేకాదు తన పాత్రకు ప్రాధాన్యత కలిగిన సినిమాలను చేస్తూ ఆమె వెండితెర పై కూడా ప్రామిసింగ్ యాక్టర్ అనిపించుకుంది. అయితే రష్మీ మాత్రం ఆ రేంజ్ లో ఇంకా సక్సెస్ కాలేదు. ఈమె ఎక్కువగా గ్లామర్ నే నమ్ముకోవడం వలన అనుకుంట..! ఈమె ఫిలిం కెరీర్ ఇంకా బిగినింగ్ స్టేజిలోనే ఉంది. అయితే నిజ జీవితంలో వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు అనసూయ, రష్మీ ఒకే వెబ్ సిరీస్ లో కలిసి నటించబోతున్నట్టు తాజా సమాచారం.

ఇందులో వీళ్లిద్దరి పాత్రలు హైలెట్ గా నిలుస్తాయట.’మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్’ వారే ఈ వెబ్ సిరీస్ ను కూడా నిర్మించబోతున్నారని సమాచారం. వాళ్ళు ఓటిటి రంగంలోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. వరుసగా వెబ్ సిరీస్ లనే ప్లానింగ్ లో వారు ఉన్నట్లు తెలుస్తుంది.కథ కూడా ఫైనల్ అయ్యిందట. జూలై లో ఇది ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus