Anasuya: కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనసూయ?

జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ బుల్లితెరపై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు మంచి యాంకర్ గా గుర్తింపు పొందారు. ఇలా పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా ఏదైనా పండుగలు ప్రత్యేక ఈవెంట్స్ జరిగిన అక్కడ అనసూయ తప్పనిసరిగా సందడి చేస్తుంది.ఇలా ఒక వైపు బుల్లితెరపై ప్రేక్షకులను సందడి చేస్తూనే అవకాశాలను అందుకొని కెరీర్లో దూసుకుపోతోంది ఈ రంగమ్మత్త. ఈ విధంగా పలు సినిమాలలో ప్రత్యేక పాత్రలలో సందడి చేసిన అనసూయ సినిమాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇక తాజాగా ఈమె 37 వ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్ విడుదల చేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.ప్రస్తుతం దాదాపు ఐదారు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండే అనసూయ బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అనసూయ బుల్లి తెరపై సందడి చేయడం కోసం ఒక్కో షోకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇలా అనసూయ బుల్లితెరపై ప్రసారమయ్యే ఒక్కో షోకి దాదాపు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం వినబడుతుంది. అయితే ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఈమె ఒకవైపు టీవీ షోలు మరోవైపు వెండితెర సినిమాలు చేయడమే కాకుండా కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా అభిమానుల సందడి చేస్తోంది.

ఈ విధంగా వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా అన్ని అవకాశాలను అందుకుని వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న అనసూయ భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో ఈమె పక్కా కమర్షియల్, రంగమార్తాండ, గాడ్ ఫాదర్, వంటి మొదలైన చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus