‘ఆచార్య’ లో అనసూయ ట్రాక్ ను అందుకే లేపేసారా?

‘జబర్దస్త్’ హాట్ యాంకర్ అనసూయ బుల్లితెరపై షోలు మాత్రమే కాకుండా వెండితెరపై వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తుంది. సినిమాల్లో గ్లామర్ పాత్రల జోలికి పోకుండా పేరు తెచ్చే బలమైన పాత్రల్నే ఎంపిక చేసుకుంటుంది. గతేడాది వచ్చిన ‘పుష్ప’ సినిమాలో ఈమె దాక్షాయణి అనే నెగిటివ్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఆచార్య’ మూవీలో కూడా ఈమె నటించింది.

ఈ మూవీలో ఆమె ఓ వైవిధ్యమైన పాత్రని పోషించింది. ఆమె లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని అప్పట్లో చిత్ర బృందం పలు సందర్భాల్లో హింట్లు ఇస్తూ వచ్చింది. ఈ పాత్ర కోసం ఆమె ఏకంగా రూ.25 లక్షలు పారితోషికం అందుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కట్ చేస్తే సినిమాలో అసలు అనసూయ పాత్రే లేదు. దాంతో అంతా షాక్ అయ్యారు. బహుశా అనసూయ కూడా షాక్ అయ్యి ఉండొచ్చు అనేది జనాలు అభిప్రాయం.

‘సినిమా నిడివి ఎక్కువవుతుందని, ఈమె పాత్ర నాన్- సింక్ గా ఉందని కట్ చేసారు’ అనేది ఇన్సైడ్ టాక్. ఈమె పాత్రనే కాదు కమెడియన్ గెటప్ శీను పాత్రని కూడా తొలగించారు. ‘స్క్రిప్ట్ ను బట్టే కదా ప్రీ ప్రొడక్షన్ టైం లో నటీనటుల ఎంపిక జరుగుతుంది.. మరి ఆ టైం లో ఈమె పాత్ర సెట్ అవుతుందో లేదో చూసుకోలేదా?’ అని కొంతమంది అంటుంటే, ‘హీరోయిన్ కాజల్ నే తీసేసిన ‘ఆచార్య’ టీంకి అనసూయ పాత్రని తీసేయడం ఓ లెక్కా?’ అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

అయితే వికీపీడియాలో మాత్రం అనసూయ ‘ఆచార్య’ లో నటిస్తున్నట్టు ఇంకా చూపిస్తుండడంతో.. నెటిజన్లు ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus