మమ్ముట్టితో అనసూయ.. మరోసారి
- January 13, 2021 / 12:37 PM ISTByFilmy Focus
వెండితెరపై నటిగా జీవితాన్ని ప్రారంభించినా… పెద్దగా అవకాశాలు సంపాదించలేకపోయింది అనసూయ. ఆ తర్వాత బుల్లితెరపై ‘జబర్దస్త్’ అంటూ వచ్చిన ఆ ప్రోగ్రామ్‌నే ఇంటిపేరుగా చేసేసుకుంది. అందం, హొయలు.. అప్పుడప్పుడు అదనపు స్కిన్ షోతో కుర్రకారును హీటెక్కిస్తూ వచ్చింది. అలా ఒకప్పుడు తనకు అవకాశాలు రాని వెండితెరపై అడుగుపెట్టేసింది. అలా అని ఇక్కడ కేవలం అందాల ప్రదర్శనకే పరిమితమవ్వలేదు. ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్ర’ లాంటి సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసింది. అలా అలా జోరు పెంచుతూ వస్తోంది.
తాజాగా అనసూయ మేనియా ఇతర పరిశ్రమలకు కూడా పాకుతోంది. మొన్నటికిమొన్న తమిళ పరిశ్రమలో అడుగుపెట్టిన అను.. ఇప్పుడు మలయాళంలోకి కూడా వెళ్తోందట. తమిళంలో విజయ్‌సేతుపతితో ఓ సినిమా చేస్తోందని వార్తలు వస్తుండగా.. ఇప్పుడు మమ్ముట్టి సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు మొదలయ్యాయి. వీటి విషయంలో అనసూయ స్పందించలేదు … అలా అని కొట్టి పారేయలేదు కూడా. అనసూయ తర్వాత మజిలీ బాలీవుడ్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. అన్నట్లు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’, రవితేజ ‘ఖిలాడీ’లోనూ అనసూయ కీలక పాత్రలు దక్కించుకుందట.

అనసూయ ఇప్పటికే మమ్ముట్టితో కలిసి నటించిన విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘యాత్ర’లో అనసూయ నటించింది. అందులో మమ్ముట్టితో ఆమె కలసి నటించింది రెండు సన్నివేశాలే. ఇప్పుడు చేయబోయే సినిమాలో ఆమెకు ప్రాధన్యమున్న పాత్రే దక్కినట్లు సమాచారం. ఇంకా ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Most Recommended Video
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!
















