అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచిది సక్సెస్ అయినటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెబుతూ వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా కనిపిస్తారు.
సోషల్ మీడియా వేదికగా అనసూయ చేసే పోస్టులు క్షణాలలో వైరల్ అవుతుంటాయి అదేవిధంగా కొన్నిసార్లు వివాదాలకు కూడా కారణం అవుతూ ఉంటాయి. అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు పరోక్షంగా కొందరిని టార్గెట్ చేసేలాగా ఉండడంతోనే ఈమె గురించి భారీ స్థాయిలో నేటిజన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు.
ఇకపోతే ఇటీవల అనసూయ ఇంస్టాగ్రామ్ వేదికగా సరదాగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మీ గురించి మీపై ట్రోల్స్ చేసే వారికి మీరేం చెబుతారు అంటూ అనసూయకు ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ ట్రోలర్స్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ట్రోలర్స్ చీడపురుగులు లాంటివారు అంటూ ఈమె కామెంట్లు చేయడమే కాకుండా అలాంటి వారికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండటం మంచిది. ఆ కంపు మనం అంటించుకోకూడదు కదా.. ఇలాంటి వాళ్ల గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోలేము అంటూ అనసూయ తనపై విమర్శలు చేసే వారి గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!