అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెబుతూ వెండి తెర సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా వెండితెర నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి అనసూయ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈమె మాత్రం తన కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు అనే సంగతి తెలిసిందే.
తన పెళ్లిరోజును లేదంటే తన పిల్లల పుట్టిన రోజు వేడుకలు అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేస్తూ తన కుటుంబానికి కావాల్సినటువంటి సమయాన్ని ఈమె ఇస్తూ ఉంటారు. ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండే అనసూయ మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇకపోతే ఈ మధ్యకాలంలో అనసూయలో భక్తి భావం కూడా ఎక్కువైందని చెప్పాలి . అనసూయ తరచు ఇంట్లో హోమాలు చేయడం పూజలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఇక తాజాగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈమె భక్తిపారవశంలో మునిగి తేలారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు ఏంటి అనసూయలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ ఈమె షేర్ చేసిన ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా అనసూయ (Anasuya) అడ్డనామాలతో శివ భక్తురాలిగా మారిపోయి కార్తీక దీపాలను వెలిగించి ఎంతో ఘనంగా ఈ కార్తీక పౌర్ణమి జరుపుకున్నారని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. పూజతో బాగా అలసిపోయాను కానీ చాలా సంతృప్తిగా ఉన్నాను అంటూ ఈమె అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫోటోలను షేర్ చేశారు.