Anasuya: నేను మొదటి నుంచి అదే చెబుతున్నాను కదా… అనసూయ కామెంట్స్ వైరల్!

అనసూయ భరద్వాజ్ పరిచయం అవరసరం లేని పేరు బుల్లితెర యాంకర్ తో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ అనంతరం వెండితెర సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇక ఈమె సినిమాలలో కథ డిమాండ్ చేయడంతో నెగిటివ్ పాత్రలలో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటించిన

అనసూయ తాజాగా నటుడు షారుక్ ఖాన్ కి సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ వీడియోలో భాగంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ తాను ఎన్నో సినిమాలలో నెగిటివ్ పాత్రలలో నటించానని తెలిపారు. తనతో పాటు జాన్ అబ్రహం కూడా నెగిటివ్ పాత్రలలో నటించారు.అలా అని మేము చెడ్డవాళ్ళం కాదు కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే ఇలాంటి పాత్రలలో నటిస్తున్నామని షారుక్ తెలియజేశారు.

ఇక ఈ వీడియోని అనసూయ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎప్పటినుంచో నేను కూడా అదే చెబుతున్నాను నెగటివ్ పాత్రలలో నటిస్తామే తప్ప నిజ జీవితంలో మేమందరం అలాంటి వాళ్ళం కాదు అంటూ అనసూయ ఈ వీడియోని షేర్ చేసారు. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనసూయ తరచు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. అయితే సోషల్ మీడియా వేదికగా కాస్త నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇలా తన గురించి నెగిటివ్ గా ట్రోల్ చేసిన వారికి అనసూయ తన స్టైల్ లో సమాధానాలు చెబుతూ ఉంటుంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus