‘నేను ఏమైనా అనొచ్చు… మీరు మాత్రం నన్ను జోక్‌గా అయినా సరే ఏమీ అనకూడదు. అంటే ఊరుకునేది లేదు’… ఈ మాట ఎవరైనా అంటే మీకు ఏమనిపిస్తుంది. కోపమొస్తుంది కదా. ఒకవేళ ఇలాంటి కోపం ఎవరిమీదైనా వస్తే చూపించుకోండి కానీ.. అనసూయ మీద చూపించొద్దు. ఎందుకంటే తిరిగి ఆమె రివర్స్‌లో మనల్ని అంటుంది కాబట్టి. ఇన్నాళ్లూగా ఆమెను సోషల్ మీడియాలో ఎందుకు అలా ట్రోలింగ్ చేస్తున్నారో అర్థం కానివాళ్లు ఆమె లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ వీడియో చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది.
సమాజంలో ప్రతి విషయం మీద స్పందించే సెలబ్రిటీల్లో యాంకర్, నటి (Anasuya) అనసూయ ఒకరు. సమాజం పట్ల తనకున్న కేరింగ్ అలాంటిది అని చెబుతుంటుంది ఆమె. అయితే సోషల్ మీడియాలో మాత్రం బూతులు, అనవసర పదాలు చాలానే వాడేస్తుంటుంది. నెటిజన్లు ఏమన్నా అంటారేమో అని ‘జోక్’ అంటూ పోస్ట్‌కి టైటిల్ పెట్టింది. ఆమె వీడియోలో ఏం చెప్పింది, ఏం మాట్లాడింది అని రాయడానికి పాత్రికేయ భాష సరిపోదు. అందుకే వినే తెలుసుకోవాలి.
న్యూ ఇయర్ సందర్భంగా తన హేటర్స్ అందరికీ డెడికేట్ చేస్తూ ఒక రీమిక్స్ రీల్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అనసూయ. ఎవరో రీల్‌ను తన వీడియోతో రీమిక్స్ చేసి ఆ వీడియో రూపొందించింది. అందులో చెప్పేదంతా సీరియస్ కంటెంట్ అయితే… జోక్ చేస్తున్నా అంటూ టైటిల్ పెట్టింది. ‘‘2023లో నా వల్ల ఎవరైతే ఇబ్బందిపడ్డారో, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎవరినైతే నేను బాధపెట్టానో మీ అందరికీ.. అంటూ మాట్లాడుతుంది. మధ్యలో మాడ్యులేషన్ మార్చింది.
‘‘వాళ్లందరికీ మంచిగయ్యింది. ఇంకొకసారి నా జోలికి రావద్దు. నెక్ట్స్ ఇయర్ కూడా ఇలాగే రిపీట్ చేస్తే… ’’ అంటూ ఏదేదో చెప్పింది ఆ వీడియోలో. అందులో అంత విషయం ఏముంది అనే డౌట్ రావొచ్చు. పద్ధతిగా ఉండాలని మాట్లాడే అనసూయ అలాంటి హార్స్ లాంగ్వేజ్ వాడటమే అక్కడ విషయం అని నెటిజన్లు అంటున్నారు. చూడాలి మరి ఇలాంటి కామెంట్ల గురించి అనసూయ ఏమంటుందో?
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!