బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. నటిగా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ‘క్షణం’, ‘రంగస్థలం’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. రీసెంట్ గా ఈ బ్యూటీ ‘పుష్ప’ సినిమాలో దాక్షాయణి అనే పాత్రలో కనిపించింది. ఫస్ట్ పార్ట్ లో కంటే సెకండ్ పార్ట్ లో ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా అనసూయ తనపై వస్తోన్న ట్రోలింగ్ పై ఘాటుగా స్పందించింది.
సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఆమె యూట్యూబ్ లో చాలా అసభ్యకరమైన థంబ్‌నెయిల్స్ పెడుతున్నారంటూ మండిపడింది. ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టే థంబ్‌నెయిల్స్ చూశానని.. ‘ఎంత లావు అయిపోయిందో చూడండి.. చూస్తే షాక్ అవుతారు’ ఇలాంటి చెత్త థంబ్‌నెయిల్స్ పెడుతున్నారంటూ మండిపడింది. ఇలాంటి పట్టించుకోవద్దని అనుకుంటాను కానీ.. అన్ని సందర్భాల్లో స్ట్రాంగ్ గా ఉండలేం కదా.. అందరికీ వీక్ మూమెంట్స్ ఉంటాయని చెప్పింది. ఇక తను బరువు పెరగడం.. లేదా తగ్గడం అనేది తన ఇష్టమని చెప్పింది.
ఇంతలా దిగజారి అవతలి వ్యక్తి గురించి ఇలాంటి థంబ్‌నెయిల్స్ ఎలా పెడతారంటూ ప్రశ్నించింది. ‘నేను కూడా మీలాగా మాట్లాడగలను.. మిమ్మల్ని హర్ట్ చేయాలనుకుంటే చేయగలను.. కానీ అది నా వ్యక్తిత్వం కాదు’ అంటూ చురకలంటించింది అనసూయ. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనసూయ ఇలాంటి కామెంట్స్ ఎన్ని చేసినా.. ఆమెపై ఇలాంటి థంబ్‌నెయిల్స్ ఆగేలా లేవు.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!