వీలుచిక్కినప్పుడల్లా… సోషల్ మీడియాలో అభిమానులతో ఛాట్ చేస్తూ ఉంటుంది హాట్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ. మీరూ ఫ్రీనా కాసేపు మాట్లాడుకుందాం అంటూ మొదలుపెడుతుంది. అయితే మధ్యలో ఎవరో ఏదో అనడం ఆమెకు కోపం చిర్రెత్తుకు రావడం చాలాసార్లు చూశాం. తనను, తన వయసును, శరీరాకృతిని ఏమన్నా అంటే… అనసూయ అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. ముందు వెనుక చూడకుండా నోటికి పని చెబుతుంది. తాజాగా మరోసారి ఇలాంటి పనే జరిగింది.
ముందుగా చెప్పినట్లు కాస్త ఫ్రీ టైమ్ దొరకడంతో అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో మాట్లాడింది. చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. దానికి ఎంతో ఓపిగ్గా సమాధానం చెప్పిన అను… ఓ ప్రశ్న దగ్గర ఆగిపోయింది. అదే ‘మిమ్మల్ని అక్క అని పిలవాలా? లేక ఆంటీ అని పిలవాలా?’ అని. ఆ తర్వాత ‘ ఆ రెండూ కాదు. నీకు నా గురించి అంతగా తెలియదు. కాబట్టి అలా పిలిచే అవకాశం నీకు తెలియదు. కానీ ఆ రెండు పేర్లు చెప్పడం చూస్తుంటే నీ పెంపకం మీదే నాకు డౌట్ వస్తోంది. ఇలా వయసు గురించి మాట్లాడుతూ మనిషిని తక్కువ చేయాలని చూడటం సరికాదు అని అంది.
ఆ తర్వాత మరో నెటిజన్ దీనికి సంబంధించి మరో ప్రశ్న అడిగారు. అక్కడ అని పిలవడం ఏజ్ షేమింగ్ ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించాడు. దానికి అనసూయ మరోసారి తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ‘మీరు చెప్పింది నిజమే కావొచ్చు. కానీ అక్కడ వాళ్ల ఆలోచన ముఖ్యం. ఎందుకు అలా అంటున్నారా అనేది ఆలోచించాలి. నేను ఏం చెబుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది’ అంటూ మరో రిప్లై ఇచ్చింది.
అదే నెటిజన్ మీరు కాంప్లిమెంట్ ఎందుకు తీసుకోరు అని అడిగారు. దానికి ఆమె సమాధానం చెబుతూ… కాంప్లిమెంట్ తీసుకోవాలా వద్దా అనేది నా ఇష్టపూర్వకం. ఒక నావ సముద్రంలో ఈదుతున్నప్పుడు లోపలికి నీటిని తీసుకుంటే మునిగిపోతుంది. అలాగే జన సముద్రంలో ఉన్న నేను కావాల్సిందే తీసుకోవాలి. అలా కాకుండా అన్నీ తీసుకుంటే మునిగిపోతా అని చెప్పింది. అందుకే ఏం తీసుకోవాలా ఏం తీసుకోవద్దో నాకు తెలుసు అని చెప్పింది అనసూయ.
1
2
Most Recommended Video
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!
చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!