విలన్ గా కనిపించబోతున్న అనసూయ..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా నటించిన ‘నరసింహా’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం గురించి మాట్లాడుకున్న వారెవరైనా నీలాంబరి పాత్ర గురించి మాట్లాడుకోకుండా ఉండలేరు. అంతలా ఆ పాత్ర ఈ సినిమాలో పండింది. ఆ పాత్రను రమ్యకృష్ణ పోషించింది. వందకు వంద శాతం రమ్యకృష్ణ ఆ పాత్రకు న్యాయం చేసిందనే చెప్పాలి. రజినీకాంత్ వంటి సూపర్ స్టార్ ను కూడా మించేలా రమ్యకృష్ణ నటించింది అనడంలో అతిశయోక్తి ఉండదు.

ప్రేమించినవాడు దక్కకపోవడంతో.. పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయి చాలా కఠినంగా మారిపోయే యువతి పాత్ర అది. ఇప్పుడు అలాంటి పాత్రలోనే అనసూయ కూడా కనిపించబోతుందట. వివరాల్లోకి వెళితే..దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది అనసూయ. ఈ చిత్రంలో జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే కఠినమైన యువతిగా అనసూయ నెగిటివ్ రోల్ లో కనిపించబోతుందట.

ఎంతో ఛాలెంజింగ్ గా ఈ పాత్ర ఉండబోతుందని సమాచారం. ‘క్షణం’ ‘రంగస్ధలం’ వంటి చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న అనసూయ.. ఈ చిత్రంలో కూడా తన పాత్రతో మెప్పిస్తుందని చిత్ర యూనిట్ సభ్యుల సమాచారం. అయితే రమ్యకృష్ణ రేంజ్ లో ఈమె మెప్పిస్తుందా అనేది పెద్ద ప్రశ్న?

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus