Anasuya: ఇండస్ట్రీలో కొనసాగుతూ హీరోయిన్లకు మించి ఆస్తులు సంపాదించిన అనసూయ!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ ఒక గుడ్ బై చెప్పి వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నారు. కార్యక్రమాలకు యాంకర్ గాను అలాగే పలు స్పెషల్ ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉండడమే కాకుండా సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్న అనసూయ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి అనసూయ హీరోయిన్లతో పాటు సమానంగా ఆస్తులను కూడా పెట్టినట్టు సమాచారం.

ఈమెకు హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో దాదాపు 8 కోట్లకు పైగా విలువ చేసే ఓ ఇల్లు ఉందట. అలాగే రెండు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయని వీటి విలువ 2.5 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఇలా హైదరాబాదులో ఈమెకు మరికొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని సమాచారం. ఈ విధంగా అనసూయ ఇండస్ట్రీలో కొనసాగుతూ సుమారు 25 కోట్లకు పైగా ఆస్తులను కూడా పెట్టిందని తెలుస్తోంది. బుల్లితెర యాంకర్లుగా కొనసాగుతున్న వారిలో సుమ తర్వాత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో అనసూయ మొదటి స్థానంలో ఉన్నారు.

ఇలా ఏడాదికి సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు ఆదాయం పొందుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అనసూయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈమె సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అదేవిధంగా ఈమె పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

ఇక ఈమె చివరిగా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈమె ప్రస్తుతం రంగమార్తాండ, పుష్ప 2 సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ లో కూడా నటించబోతున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus