Bigg Boss OTT: ఓటీటీకి యాంకర్ ఎవరో తెలుసా..! ఈసారి పార్టిసిపెంట్స్ ఎవరంటే.?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫినాలేకి ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో స్టేజ్ పైన ఓటీటీ సీజన్ 2ని ఎనౌన్స్ చేయబోతున్నారు. అయితే, ఓటిటికి మాత్రం నాగార్జున యాంకరింగ్ చేయడం లేదు. హీరో శ్రీకాంత్ యాంకరింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికోసం ముందుగానే శ్రీకాంత్ తో బిగ్ బాస్ టీమ్ అగ్రిమెంట్స్ చేసుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. నిజానికి హోస్ట్ గా నాగార్జున చేయాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఓటీటీకి హోస్ట్ ని మారుస్తున్నారు. అయితే, చాలామంది శివాజీని హోస్ట్ గా పెట్టాలని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం శివాజీ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడని, ఎవరినైనా సరే కడిగిపారేస్తున్నాడని ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ సీజన్ 1లో నాగార్జున తన దైన స్టైల్లో యాంకరింగ్ చేశాడు. ఈ సీజన్ లో పాత కంటెస్టెంట్స్ తో పాటుగా కొత్తవాళ్లు కూడా వచ్చారు. అయితే, వారందరూ కూడా సగానికి సగంమంది సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకున్న వాళ్లే కావడం విశేషం. ఇప్పుడు కూడా సీజన్ 2 ఇలాగే ఉంటుందా లేదా వేరే రకంగా ఏదైనా మారుస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతం తెలుగు సీజన్ 7లో ఫినాలే స్టేజ్ పైన ఓటీటీ గురించి ఎనౌన్స్ మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈసారి పార్టిసిపెంట్స్ ని యూట్యూబ్ లో బాగా ఫేమ్ ఉన్నవాళ్లని తీసుకుంటున్నారు. గతంలో ఈ ఓటీటీ సీజన్ ఫిమేల్ కంటెస్టెంట్ గా వచ్చి బిందుమాధవి విన్నర్ అయిన సంగతి తెలిసిందే. సీజన్ 7కి మిస్ అయిన కంటెస్టెంట్స్ ని ఓటీటీలో తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో జబర్ధస్త్ ఫేమ్ నుంచీ కూడా కొంతమంది వెళ్లే అవకాశం ఉంది.

ఈ సీజన్ ని ఎలాగైనా సరే హాట్ స్టార్ లో హిట్ చేస్తే, (Bigg Boss) సీజన్ 8 రసవత్తరంగా ఉంటుందనే ఆలోచనలో ఉంది బిగ్ బాస్ టీమ్. మరోవైపు బిగ్ బాస్ ఓటీటీలో స్పాన్సర్స్ కోసం కూడా చూస్తున్నారు. గతంలో ఓటీటీకి అస్సలు స్పాన్సర్స్ రాలేదు. కేవలం టాస్క్ లపైనే ఆధారపడి ఉంది. అంతేకాదు, 24గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ చేస్తే రేటింగ్ కూడా అంత పెద్దగా రాలేదు. మరి ఈసారి సీజన్ 1లో జరిగిన తప్పులని అధిగమిస్తూ సీజన్ 2ని సక్సెస్ చేయాలని చూస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.

ఒకవైపు తమిళంలో కూడా సీజన్ సక్సెస్ గా నడుస్తోంది. అక్కడ కూడా ఓటీటీ సీజన్ ని తీసుకొచ్చేందుకు ముమ్మరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. రీసంట్ గా డిస్నీ – స్టార్ నెట్ వర్క్ ని మొత్తం రియలన్స్ కొనుక్కునే ఆలోచనలో ఉంది. వాళ్లు రంగంలోకి దిగితే బడ్జెట్ కి ఎలాంటి లోటు ఉండదు. అప్పుడు పార్టిసిపెంట్స్ కి కూడా ఒక రేంజ్ లో రెమ్యూనిరేషన్ వర్కౌట్ అవుతుంది. అదీ మేటర్.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus