యాంకర్ శివ విన్నర్ కోసం సైగ చేశాడా ? ధనుష్ ఏం చెప్పాడో తెలుసా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో పార్టిసిపెంట్స్ ఫ్రెండ్స్ వాళ్లకి హింట్స్ ఇచ్చేందుకు తెగ ప్రయత్నించారు. ఇందులో బాగంగా స్టేజ్ పైకి వచ్చిన యాంకర్ శివ మిత్రుడు ధనుష్, అలాగే షణ్ముక్ జస్వంత్ ఇద్దరూ కూడా శివని పలకరించారు. ఆ మాట ఈ మాట చెప్తూనే విన్నర్ ఎవరు అవుతారు అనేది హింట్స్ ఇచ్చేందుకు చూసారు. ముఖ్యంగా ధనుష్ వెళ్లిపోయేటపుడు శివతో సైగలు చేశాడు. దీన్ని హౌస్ మేట్స్ అబ్జక్ట్ చేస్తుంటే నాగార్జున ముందు కవర్ చేశాడు శివ.

ఎంటర్ టైన్మెంట్ వస్తోంది కదా అంటూ మాట్లాడాను అంతే అని చెప్పాడు. కానీ, ఈ సైగలకి అసలు అర్ధమేంటి ? ధనుష్ ఏం చెప్పాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియోని తెగ షేర్లు చేస్తున్నారు బిగ్ బాస్ లవర్స్. యాంకర్ శివకి ఆల్ ద బెస్ట్ చెప్తూ వెళ్లిపోయే టైమ్ లో ధనుష్ ని ఎవరు విన్నర్ అవుతారు అంటూ చేతులతో సైగ చేస్తూ శివ అడిగాడు. మా ఇద్దరిలోనే ఉంటుందా పోటీ అని అడిగేసరికి , యాంకర్ శివ నువ్వు కాదు, బిందు – అఖిల్ అన్నట్లుగా సైగ చేశాడు.

మీ ఇద్దరు కాదు, వాళ్లిద్దరూ అని క్లియర్ గా చెప్పాడు. దీంతో యాంకర్ శివ అర్దమయ్యి అవ్వన్నట్లుగా తలూపాడు. స్టేజ్ పైన నాగార్జున సాక్షిగా వీళ్లిద్దరూ ఇలా సైగలతో మాట్లాడుకున్నారు. యాంకర్ శివ కాంట్రవర్సీ ఇంటర్య్వూలు చేస్తాడనే తెలుసు అని, కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక తను సూపర్ గా ఎంటర్ టైన్ చేస్తున్నాడని షణ్ముక్ జస్వంత్ చెప్పాడు.

అంతేకాదు, తన దృష్టిలో టాప్ 5 ఎవరో కూడా క్లియర్ గా చెప్పాడు. శివని ఫస్ట్ ప్లేస్ లో పెట్టి , అఖిల్ ని సెకండ్ పొజీషన్ లో పెట్టాడు షణ్ముక్. తనకి బయట బాగా నెగిటివిటీ వచ్చినపుడు అఖిల్ తన తరపున మాట్లాడాడు అని, అసలు మాకు పరిచయం లేకపోయినా సపోర్ట్ చేశాడని అఖిల్ గురించి కూడా చెప్పాడు షణ్ముక్ జస్వంత్. మొత్తానికి అదీ మేటర్.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus