డిసెంబర్ నాటికి కరోనా పని క్లైమాక్స్ కు వచ్చిందని అంతా సంతోషించారు. పరిశ్రమలు కూడా మెల్ల మెల్లగా కోలుకోవడం చూసాం. ఫిబ్రవరి వరకు బాగానే ఉంది. కానీ మార్చి నుండీ పరిస్థితి కంట్రోల్ తప్పింది. అన్ని పరిశ్రమలు మళ్ళీ మూతపడ్డాయి. ప్రభుత్వం లాక్ డౌన్ విధించక పోయినప్పటికీ.. ఆ దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. ఇక చాలా మంది సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు. గతేడాది కంటే కూడా ఇప్పుడు 3 రెట్లు కేసులు నమోదవుతుండడం గమనార్హం.
ఇక శుభకార్యాల విషయంలో కూడా గత ఏడాది పాటించిన పద్ధతులనే పాటించాలని చాలా మంది డిసైడ్ అయ్యారు. ఇదే కోవలో యాంకర్ ఝాన్సీ బంధువుల ఇంట్లో ఆన్లైన్ ఎంగేజ్మెంట్ జరగడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయంలో ఝాన్సీ కూడా అసహనం వ్యక్తం చేసింది. ఈ ఎంగేజ్మెంట్ పిక్స్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఝాన్సీ.. ‘గతేడాది నుండీ కరోనాని చాలా మంది తిట్టుకుంటూ వస్తున్నారు. అయితే నేను మాత్రం ఇప్పుడే తిట్టడం మొదలుపెట్టాను.
నాకు కరోనా అంటే అసహ్యం వేస్తుంది.ఇటీవల నా కొడుకు లాంటి వ్యక్తి.. సంపత్ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు నేను హాజరు కాలేకపోయాను. అయితే ఆన్లైన్ లో వీక్షించాను. ఆ నిశ్చితార్ధ వేడుకకి కేవలం ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారంతా నాలాగా ఆన్లైన్ లో చూసినవాళ్ళే. నాతో కలిపి 300 మంది ఆన్లైన్లో ఈ నిశ్చితార్ధ వేడుకను చూసారు. ఇది కొత్తగా అనిపిస్తుంది అలాగే బాధగా కూడా అనిపిస్తుంది. కానీ తప్పదు.. ఏం చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చింది.