రోజా కూతురు అన్షు మాలిక ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పిచ్చ క్రేజ్ సొంతం చేసుకుంటుంది. ఆ క్రేజ్ తో ఆల్రెడీ స్మాల్ స్క్రీన్ పై పలు షోలలో ఈ బ్యూటీ సందడి చేసింది. అలాగే ఛాన్స్ దొరికిన ప్రతిసారీ తన ఫోటోలు, వీడియోలు వైరల్ చేసుకునే ప్రయత్నాలు చాలా చేస్తుంది. అందులో చాలా వరకు సక్సెస్ అవుతుంది అని కూడా చెప్పాలి.
మొన్నామధ్య శ్రీకాంత్ కొడుకు రోషన్ ఓ ఇంటర్వ్యూలో ‘అమ్మాయిల్లో నీకు నచ్చే క్వాలిటీ ఏంటి’ అని అడిగిన ప్రశ్నకు… అతను ‘సింపుల్ గా ఉండాలి ఎటువంటి హడావుడి లేకుండా’ అంటూ కామెంట్ చేశాడు. దాన్ని కూడా అన్షు తన కొలాబ్ వీడియోకి జత చేసుకుని వైరల్ అయ్యింది. ఇలా ఈ అమ్మడు.. తనకు తాను పీఆర్ కూడా చేసుకుంటుంది అని చెప్పాలి.
ఇదిలా ఉండగా.. అన్షు మాలిక తన లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అన్షుని చూస్తుంటే..ఆమె తల్లి రోజా గారి వింటేజ్ పిక్స్ చూసినట్టు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరికొంతమంది అయితే ‘జిరాక్స్’ అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే ‘సినిమాల్లోకి హీరోయిన్ గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తావ్?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. అలా ఇప్పుడు అన్షు ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి అని చెప్పాలి.