Anchor Pradeep: పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ ప్రదీప్!
- September 26, 2022 / 01:06 PM ISTByFilmy Focus
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నారు. అయితే ఎక్కువ భాగం లేడీ యాంకర్స్ ఉన్నారనే చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలో తక్కువ సంఖ్యలో మేల్ యాంకర్స్ ఉన్నారు. ఇలా మేల్ యాంకర్లలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారిలో ప్రదీప్ ఒకరు. ఈయన బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా వెండితెరపై కూడా సందడి చేస్తున్నారు.
ప్రదీప్ ఇదివరకే ఎన్నో సినిమాలలో హీరో ఫ్రెండ్ పాత్రలలో నటించి సందడి చేశారు.అయితే ఈయన 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఈ సినిమా తరువాత ప్రదీప్ ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు. ఈ విధంగా ఈయన సినిమాల గురించి ఎలాంటి ప్రకటన ఇవ్వకపోయినా బుల్లితెరపై మాత్రం ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ప్రదీప్ ఏ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పెళ్లి గురించి పెద్ద ఎత్తున ప్రస్తావన వస్తుంటుంది.

సోషల్ మీడియాలో ప్రదీప్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ వార్త వైరల్ అవుతుంది.అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనే విషయం తెలియక పోయినప్పటికీ ఈ విషయం మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా యాంకర్ తననీ ప్రశ్నిస్తూ మీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ప్రదీప్ సమాధానం చెబుతూ తన పెళ్లి చేసుకున్న విషయం మీకు తెలియదా.. నేను ఒకసారి కాదండోయ్ రెండు మూడు సార్లు పెళ్లి చేసుకున్నాను. యూట్యూబ్లో మీరు ఎక్కడ చూడలేదా అంటూ తన పై తానే కౌంటర్లు వేసుకున్నారు. అయితే తన పెళ్లి గురించి వచ్చే వార్తలని పూర్తిగా అవాస్తవమేనని ఈ సందర్భంగా ప్రదీప్ తన పెళ్లి గురించి వచ్చే వార్తలను కొట్టి పారేశారు.
కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!












