గత పది రోజులుగా రష్మీ టైం ఏ మాత్రం బాలేదని తెలుస్తుంది. ఈమె సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసినా క్షణాల్లో ఆ పోస్ట్ వైరల్ గా మారడమే కాకుండా నేటిజెన్ల ఆగ్రహానికి గురవుతూ వారి చేతిలో భారీగా ట్రోల్ అవుతున్నారు. ఎప్పుడైతే అంబర్ పేట్ ఘటనపై ఈమె స్పందిస్తూ వీధి కుక్కలకు మద్దతు తెలిపారో అప్పటినుంచి నేటిజన్స్ ఈమెను టార్గెట్ చేస్తూ ఈమె ఏ విషయం గురించి మాట్లాడిన తనని ట్రోల్ చేస్తున్నారు.
ఈ విధంగా తన గురించి ఎలాంటి ట్రోల్స్ వచ్చినా తాను మాత్రం తగ్గేదేలే అన్నట్టు తరచూ తనకు సంబంధించిన విషయాలతో పాటు సామాజిక అంశాలపై కూడా ఈమె స్పందిస్తూ కామెంట్లు చేస్తుంటారు. ముఖ్యంగా జంతు ప్రేమికురాలు అయినటువంటి రష్మీ మూగజీవాలపై తనకు ఉన్నటువంటి ప్రేమను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు.తాజాగా ఈమె డైరీ ప్రొడక్ట్స్ కు సంబంధించినటువంటి ఒక ట్వీట్ ద్వారా మరోసారి నేటిజన్ల ట్రోలింగ్ కి గురయ్యారు. ఈ సందర్భంగా డైరీ ప్రొడక్ట్స్ గురించి ఈమె ట్వీట్ చేస్తూ తాను డైరీ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడం పూర్తిగా మానేశానని తెలియజేశారు.
అయితే రష్మీ ఇలాంటివి చేయగానే నేటిజన్స్ గతంలో ఆమె చేతుల మీదుగా ఐస్ క్రీమ్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇక ఈ వీడియోలను షేర్ చేస్తూ కొందరు నేటిజన్స్ ఈ సెలబ్రిటీలు ఎప్పుడూ ఇంతే డబ్బు కోసం క్షణాలలో మాట మారుస్తుంటారు అంటూ తనని ట్రోల్ చేస్తున్నారు. ఇలా రష్మీ ఈ విషయంపై స్పందిస్తూ.. అవును గతంలో నాకు తెలియక నేను కొన్ని తప్పులు చేశాను.కానీ గత కొంతకాలంగా నేను పాలు తాగడం పాల ఉత్పత్తులను తినడం పూర్తిగా మానేశాను.
ఇలా పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం వలన శరీరంపై అనారోగ్య ప్రభావం పడటానికి గమనించానని తెలిపారు. ఇక ఫ్యాక్టరీలలో పాల ఉత్పత్తులను తయారు చేయడం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత తాను పాల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం పూర్తిగా మానేశాను అంటూ ఈ సందర్భంగా నేటిజన్స్ చేసినటువంటి కామెంట్లపై స్పందిస్తూ ఈమె తన అభిప్రాయాలను తెలియజేశారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.