మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ పూర్తి చేసుకుంది. జూలై 7న హైదరాబాద్‌లో మొదలైన ఈ సినిమా, కేవలం 140 రోజుల్లోనే మొత్తం చిత్రీకరణను కంప్లీట్ చేశారు పూరి. చిత్రబృందం షేర్ చేసిన లాస్ట్ డే షూట్ వీడియోలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ…ఈ సినిమాలో ప్రేక్షకులు నిజమైన భావోద్వేగాల ఆస్వాదిస్తారని అన్నారు.
Puri Jagannadh
పూరీ కనెక్ట్స్, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో సంయుక్త , టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హర్షవర్ధన్ రమేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.
దర్శకుడు పూరి జగన్నాథ్ అంటేనే యూత్‌ఫుల్, స్టైలిష్ మేకింగ్‌కి ప్రసిద్ధి. ‘పోకిరి’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘టెంపర్’, ‘బద్రి’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తనదైన మాస్ డైరెక్షన్‌కి గుర్తింపు తెచ్చుకున్నారు. పూరి చివరగా డైరెక్ట్ చేసిన లైగర్ , డబుల్ ఇస్మార్ట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయాయి. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో చాలా హైప్ నెలకొంది.
షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో త్వరలో వచ్చే అప్‌డేట్స్‌పై ఇప్పుడు టాలీవుడ్ దృష్టంతా ఉంది. పూరి-సేతుపతి కలయిక ఏ రేంజ్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతుందో చూడాలి!