బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్నటువంటి వారిలో నటి రష్మి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి సక్సెస్ కావడంతో అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరించే అవకాశాన్ని అందుకున్నారు ఇలా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మీ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ వెండితెరపై మాత్రం సక్సెస్ కాలేకపోయారు. ఇక బుల్లితెరపై సుడిగాలి సుదీర్ తో కలిసి ఈమె చేసినటువంటి స్కిట్లు అలాగే ప్రత్యేకంగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఈమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి
వీరిద్దరి కెమిస్ట్రీ మంచిగా వర్క్ అవుట్ అవ్వడంతో నిజజీవితంలో కూడా వీరిద్దరూ ఒక్కటైతే బాగుంటుందని చాలామంది భావించారు. దీంతో సుధీర్ రష్మీ జంటకు భారీ స్థాయిలో అభిమానులు కూడా పెరిగిపోయారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్లినా రష్మీ పెళ్లి గురించి ప్రస్తావనకు వస్తుంది. రష్మీ నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్నప్పటికీ
ఇంకా సింగిల్ గానే ఉండడంతో ఆడియన్స్ నుంచే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా తరచూ ఆమెకు ఇదే ప్రశ్న ఎదురు కావడంతో పెళ్లి గురించి ఈమె షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఈమె పెళ్లికి సిద్ధమైందని త్వరలోనే తన ముహూర్తం ఎప్పుడు అనే విషయాన్ని కూడా ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. నూతన సంవత్సరం రాబోతున్నటువంటి నేపథ్యంలో రష్మీ పెళ్లి పార్టీ అంటూ ఓ స్పెషల్ షో నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా రష్మీ (Rashmi) తన పెళ్లి విషయాన్ని ప్రకటించడం కోసం ముహూర్తం కూడా నిర్ణయించారు అయితే ఆ ముహూర్తం ఎప్పుడు అనే విషయానికి వస్తే డిసెంబర్ 31వ తేదీ రాత్రి 9:30 నిమిషాలకు తన పెళ్లి పెళ్లికి సంబంధించిన విషయాలను ప్రకటిస్తానని ఈమె తెలియజేశారు. అయితే ఇదంతా కూడా ఒక షోలో బాగామని తెలుస్తుంది. ఈ షోలో నిజంగానే ఈమె తన పెళ్లి గురించి ప్రకటిస్తారా లేదా అనే విషయంపై ఆసక్తి నెలకొంది.