ప్రముఖ టాలీవుడ్ యాంకర్లలో ఒకరైన రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ నవంబర్ 4వ తేదీన రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాలో హీరోగా నటించిన నందు రష్మీ ప్రమోషన్స్ కు హాజరు కావడం లేదంటూ ఒక వీడియోను వైరల్ చేసిన సంగతి తెలిసిందే. చాలామంది ఆ వీడియోను చూసి ప్రాంక్ వీడియో అని అనుకున్నారు. అయితే రష్మీ మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైరల్ అయిన వీడియో గురించి క్లారిటీ ఇచ్చారు.
నందు ప్రాంక్ వీడియో చేసినా నేను చెప్పే విషయాలు మాత్రం ప్రాంక్ కాదని రష్మీ కామెంట్లు చేశారు. వీడియోలో చెప్పిన విషయాలు నిజంగానే నేను చెప్పిన విషయాలు అని రష్మీ చెప్పుకొచ్చారు. అకస్మాత్తుగా మూవీ ప్రమోషన్స్ కు రావాలని చెబితే ఎలా వస్తారని రష్మీ కామెంట్లు చేశారు. వేరే షెడ్యూల్ లో ఉన్న సమయంలో విసిగిస్తే ఎలా అని రష్మీ ప్రశ్నించారు. అవకాశం ఉంటే నా వాష్ రూమ్ లో కూడా కెమెరాలు పెట్టేలా ఉన్నారని రష్మీ చెప్పుకొచ్చారు.
రష్మీ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. హీరో నందుపై రష్మీ గౌతమ్ పరోక్షంగా ఫైర్ అయ్యారు. రష్మీ ప్రస్తుతం బుల్లితెర షోలతో పాటు సినిమాలతో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రష్మీ చేసిన కామెంట్ల విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేను ప్రమోషన్స్ కు వస్తానని చెప్పినా వాళ్లకు తొందర ఆగలేదని రష్మీ పేర్కొన్నారు.
రష్మీ హీరోయిన్ గా నటించిన సినిమాలలో గుంటూరు టాకీస్ మినహా మరే సినిమా సక్సెస్ సాధించలేదు. బొమ్మ బ్లాక్ బస్టర్ తో రష్మీ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. రష్మీ కెరీర్ కు ప్రస్తుతం ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవసరం అనే సంగతి తెలిసిందే. బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పటికే పలు రిలీజ్ డేట్లను మార్చుకుని నవంబర్ లో రిలీజ్ కానుంది.