Anchor Ravi: గ్రాండ్‌గా యాంకర్ రవి భార్య నిత్య బర్త్‌డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న వీడియో..

ఈమధ్య కాలంలో సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలు సోషల్ మీడియా కారణంగా నిత్యం ఫ్యాన్స్, ఆడియన్స్‌కి ఎప్పుడూ టచ్‌లో ఉంటున్నారు.. పర్సనల్, ప్రొఫెషనల్ అప్‌డేట్స్ షేర్ చేస్తూ మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్‌ని పెంచుకుంటున్నారు..స్టార్స్ పుట్టినరోజులు, గృహప్రవేశం, నిశ్చితార్థం, పెళ్లి, సీమంతం.. ఇలాంటి శుభకార్యాలకు సంబంధించిన పిక్స్, వీడియోస్ ఎంతలా వైరల్ అవుతున్నాయో తెలిసిందే.. రీసెంట్‌గా పాపులర్ టాలీవుడ్ యాంకర్ రవి తన భార్య నిత్య సక్సేనా బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు..

యాంకర్ రవి భార్య నిత్య, కుమార్తె వియా కూడా ప్రేక్షకులకు సుపరిచితమే.. రవి తన వైఫ్ బర్త్‌డేని సర్‌ప్రైజింగ్‌గా ప్లాన్ చేశాడు.. అతికొద్ది మంది సన్నిహితులను మాత్రమే ఈ పార్టీకి పిలిచాడు.. దీని కోసం షాద్‌నగర్‌లో బ్యాక్‌యార్డ్ తోట అనే ఫామ్‌హౌస్‌ని బుక్ చేసినట్టు చెప్పాడు. తన భార్యకి గుడికి వెళ్తున్నామని అబద్ధం చెప్పి వచ్చామని చెప్పిన రవి.. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక తనను ఆమెను కూడా ఫామ్‌హౌస్‌కి రమ్మన్నాడు..

అయితే వీళ్ళు ఫామ్‌హౌస్‌లో ఉన్నారనే సంగతి తెలియని నిత్య.. అక్కడికెళ్లి అందర్నీ చూసి షాక్‌‌తో కూడిన సర్‌ప్రైజ్‌కి గురయ్యింది.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus