Anchor Ravi Mother: రవి ఎలిమినేషన్ పై అతడి తల్లి షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న రవి ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాడు. టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేయడంతో చాలా మంది బిగ్ బాస్ షోని విమర్శించారు. రవి తల్లి కూడా తన కొడుకు ఎలిమినేషన్ పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రవి ఎలిమినేట్ అయిన తరువాత అతడి ఫ్యాన్స్.. డీజేతో గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు.

అక్కడకి వచ్చిన మీడియాతో రవి తల్లి ఉమారాణి ముచ్చటించింది. రవి ఎలిమినేషన్ పై స్పందించమని అడిగితే.. ప్రెషర్‌ కుక్కర్‌ నుంచి బయట పడినట్టు ఉందని చెప్పింది. అలానే రవిని వాళ్లు ఎన్‌కౌంటర్‌ చేసినట్టు అనిపిస్తోందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. టాప్ 5లో ఉండాల్సిన తన కొడుకు ఇలా ఎలిమినేట్ అవ్వడం ఆశ్చర్యంగా ఉందని చెప్పింది ఉమారాణి. అతడు గేమ్‌ ఆడాడని.. పిచ్చి చేష్టలు చేసి రాలేదని.. ఊరికే కూర్చోని తినలేదని.. రవి గేమర్‌ అని చెప్పింది.

‘మీకు ఆట ఆడేవాళ్లు, మంచివాళ్లు అవసరం లేదని అర్థమైంది. కావాలని పిలిచి తీసుకెళ్లారు. కానీ ఆ హోదా ఇవ్వలేదు’ అంటూ బిగ్ బాస్ పై ఫైర్ అయింది. సెలబ్రెటీలను పట్టుకు తీసుకెళ్లి మేకల్లా, గొర్రెల్లా ఉంచారు.. అదే ఇండస్ట్రీలో ఉంటూ.. ఇండస్ట్రీ వారిని అవమానిస్తున్నారని ఉమారాణి మండిపడింది. ఇప్పటికైనా షో కాన్సెప్ట్ మార్చాలని.. లేకపోతే ఎవరూ చూడరని చెప్పింది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus