యాంకర్ రవి ‘బిగ్ బాస్ సీజన్ 5’ లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కూల్ గా గేమ్ ఆడుతున్నాడు.నిజానికి మొదటి సీజన్ నుండీ ఇతన్ని ‘బిగ్ బాస్’ నిర్వాహకులు సంప్రదిస్తున్నప్పటికీ ఇతను ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే ఈ సీజన్ 5 కి అతనికి అన్ని విధాలుగా కుదరడంతో ఎంట్రీ ఇచ్చినట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. రవి జర్నీ అందరికీ సుపరిచితమే. 365 రోజులు బిజీగా ఉండే రవి యాంకరింగ్ ను మాస్ ప్రేక్షకులు కూడా ఇష్టపడుతుంటారు. అయితే గతంలో ఎవ్వరూ ఊహించని విధంగా రవి ఓ సినిమా ఫంక్షన్ వేడుకలో మాట్లాడిన మాటల వల్ల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
ఆ సినిమా మరేదో కాదు. నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఈ సినిమా రవిని 3 ఏళ్ళు కోర్టు మెట్లెక్కించిందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు రవి. మేటర్ ఏంటంటే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సీనియర్ నటుడు చలపతి రావు పరధ్యానంలో ఆడవాళ్ళ గురించి బహిరంగంగానే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసాడు. అవి యాంకర్ రవికి సరిగ్గా వినపడకుండా ‘సూపర్ సర్’ అనేశాడు. ఫంక్షన్ ను త్వరగా ముగించాలనే టెన్షన్ అతనిది.అందులోనూ అతనికి ఇచ్చిన మైక్, రిసీవర్లు కూడా సరిగ్గా పనిచేయడం లేదట. అందుకే చలపతి గారు మాట్లాడిన మాటలు సరిగ్గా వినకుండా.. తొందరగా ఈవెంట్ ను ముగించాలనే ఉద్దేశంతో రవి అలా అన్నాడట.
అది కాస్త పెద్ద వివాదానికి దారి తీసింది. ‘నా ఇంట్లోనే ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు. నా తల్లి.. నా భార్య… నా కూతురు,వాళ్ళని నేను ఎంతో ప్రేమిస్తాను.. గౌరవిస్తాను. నేను ఆడవాళ్ళ గురించి ఎలా తప్పుగా మాట్లాడతాను. ఆ ఒక్క సినిమా వల్ల నేను 3 ఏళ్ళు కోర్టుమెట్లెక్కాను. సారీ చెబితే అయిపోయేది కానీ నా తప్పు లేకుండా.. ఆడవాళ్ళను కించపరిచే ఉద్దేశం లేకుండా నేను ఎలా సారీ చెబుతాను. అందుకే సారీ చెప్పలేదు. న్యాయం కోసం కోర్టునే ఆశ్రయించాను’ అంటూ రవి ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?