Shiva Jyothi: గృహప్రవేశం చేసిన శివ జ్యోతి!.. వైరల్ అవుతున్న వీడియో..

బుల్లితెర సెలబ్రిటీల్లో న్యూస్ రీడర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. తన తెలంగాణ యాస, మేనరిజమ్స్‌తో ఆకట్టుకుని, ప్రేక్షకుల ఇంట్లో మనిషిలా మారిపోయింది సావిత్రి అలియాస్ శివ జ్యోతి.. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు ఫ్యాన్స్, నెటిజన్లకు టచ్‌లో ఉంటుంది.. తన పర్సనల్ విషయాలన్నీ షేర్ చేస్తుంటుంది. ఇంట్లో జరిగే పలు ఫంక్షన్లకు సంబంధించిన విశేషాలు, లేటెస్ట్ ఫోటోషూట్స్, ఫ్యామిలీ పిక్స్, రీల్స్ వంటి వాటితో అలరిస్తుంటుంది. తాజాగా ఈ స్టార్ యాంకర్ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేస్తున్న వీడియో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.

కొద్ది రోజుల క్రితం సొంతింటి పనులు ప్రారంభించారు. చాలా ఖర్చు పెట్టి మరీ ఇంటీరియర్ చేయిస్తే అదంతా కూలిపోయిందని చెప్తూ బాధ పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఇంటిని బాగు చేయించారు.. ఎంచక్కా పూజా కార్యక్రమాలతో కొత్త ఇంట్లోకి కాలు పెట్టేశారు. శివ జ్యోతి తమ గృహప్రవేశానికి సంబంధించిన విశేషాలన్నిటినీ వీడియో షూట్ చేసి.. తన యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఇక ఆ వీడియోలో ఇంటికొచ్చిన మహిళా అతిథుల కాళ్లకు పసుపు రాయడం, తాంబూలం ఇవ్వడంతో పాటు భోజనాల ఏర్పాట్లకు సంబంధించిన విజువల్స్ ఉన్నాయి.. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దగ్గర్లోని గుడికి వెళ్లి దేవుడికి కొబ్బరికాయ కొట్టారు. ఇలా తన అత్తారింట్లో శివ జ్యోతి తెగ సందడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..


రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus