Anchor Siva:యాంకర్ శివ వన్ సైడ్ లవ్..! ఇంట్రస్టింగ్ పాయింట్ ఇదేనా !

బిగ్ బాస్ హౌస్ లో ప్రేమకథలు చెప్పడం స్టార్ట్ చేశారు హౌస్ మేట్స్. లాస్ట్ సీజన్ లో లాగానే తొలిప్రేమ టాస్క్ లో భాగంగా వాళ్ల జీవితంలో ఉన్న ప్రేమ క్షణాలని హౌస్ మేట్స్ తో, ఆడియన్స్ తో పంచుకున్నారు. ఇందులో భాగంగానే యాంకర్ శివ లవ్ స్టోరీ చాలా డిఫరెంట్ గా సాగింది. తను వాళ్ల నాన్న గారి కూరగాయల కొట్టు దాటిన తర్వాత బస్ స్టాప్ దగ్గర నుంచునేవాడు.

అక్కడకి ప్రతిరోజూ కాలేజ్ కి వెళ్లే అమ్మాయిలు వస్తుంటారు. ఒకరోజు ఒక అమ్మాయిని చూశాడట. చాలా సైలెంట్ గా కామ్ గా, పద్దతిగా ఉందని మొదటి చూపులోనే శివకి నచ్చేసింది. అంతే, అప్పట్నుంచీ ఆమెని ఫాలో అవుతూ ఉన్నాడట. పక్కనున్న అమ్మాయికి చెప్తే , ఆ అమ్మాయి ఊరంతా ప్రచారం చేసినట్లుగా అందరికీ చెప్పేసిందని, చివరకి ఆ అమ్మాయికి కూడా చెప్పేసిందని అన్నాడు. ఇలా ఆ అమ్మాయిని చూస్తునే చాలా సవంత్సరాలు గడిపేశాడట.

తను కాలేజ్ కి వెళ్లేటపుడు ఆ అమ్మాయిని ఫాలో అయ్యి, బాడీ గార్డ్ లాగా తను కాలేజ్ లోకి వెళ్లిన తర్వాతే తను పని చూసుకునేవాడ్ని అని చెప్పుకొచ్చాడు. తను ఇంతకాలం వన్ సైడ్ లవ్ మాత్రమే చేశానని ముగించాడు.ఇక మరోవైపు అరియానా కూడా తన బావతో అయిన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. చాలాకాలం ఉన్న రిలేషన్ ని ఇప్పుడు వదిలేశాడని , చాలా బాధగా ఉందని ఆ పెయిన్ తీస్కోలేకపోతున్నాని చెప్పింది.

ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్లినా కూడా నన్ను ఎవైడ్ చేసేస్తున్నాడని అన్నది. చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిన తర్వాత స్ట్రాంగ్ అవ్వడం అనేది చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చింది అరియానా. నటరాజ్ మాస్టర్ ఎప్పటిలాగానే నీతూ గురించి చెప్తూ, ఏడు సంవత్సారాలు తను ప్రేమించిందని, చివరకి తానే ఒక డిన్నర్ కి తీస్కుని వెళ్లి ఐ లవ్ యూ చెప్పానని అన్నాడు. అప్పట్లో తొలిప్రేమ అంటే తెలిసేది కాదని, ఎవరిమీద అయినా సరే క్రష్ మాత్రమే ఉండేదని నటరాజ్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

దీంతో హౌస్ మేట్స్ మాస్టర్ తో కాసేపు ఆడుకున్నారు. బిందు కూడా తన ప్రేమ, బ్రేకప్ గురించి చెప్పింది. అలాగే స్రవంతి కూడా తనని ఇంట్లో ఎలా బంధించారు ? ఎలా పారిపోయి పెళ్లి చేసుకుందో చెప్పుకొచ్చింది. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus