తిరుమల శ్రీవారి ప్రసాదం చుట్టూ ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. కొన్ని నెలల క్రితం వచ్చిన అడల్ట్రేటడ్ నెయ్యి విమర్శల గురించి మీకు తెలిసిందే. ఎవరు, ఎవరి మీద ఆ కామెంట్స్ చేశారు, అక్కడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతోంది అనే విషయాలు మీకు తెలిసే ఉంటాయి. ఆ విషయాలేవీ ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు కానీ.. ఇప్పుడు టీవీ నటి, యాంకర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు మరోసారి ‘తిరుమల ప్రసాదం’ గురించి చర్చ జరగడానికి కారణం.
యాంకర్ శివ జ్యోతి గురించి అందరికీ తెలిసిందే. తెలంగాణ యాసలో తనదైన స్టైల్‌లో తీన్మార్ సావిత్రిగా వార్తలతోనే పాపులారిటీ సంపాదించుకున్న ఆమె ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మంచి హైపే సంపాదించుకుంది. బయటకు వచ్చాక టీవీ షోల్లో ఈవెంట్స్‌కు హాజరవుతా ఎప్పుడూ ప్రేక్షకులకు కనిపిస్తూనే ఉంది. ఇక సోషల్ మీడియాలో ఆమె చాలా ఫేమస్. అలా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేశాయి.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి క్యూ లైన్‌లో ఇచ్చే ప్రసాదంపై శివ జ్యోతి చేసిన కామెంట్స్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఫ్రెండ్ సోను ప్రసాదాన్ని తీసుకుంటుండగా ‘సోను కాస్ట్‌లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్’ అంటూ నవ్వుతూ కామెంట్స్ చేశారు శివజ్యోతి. ‘జీవితంలో ఎప్పుడూ అడుక్కోలేదు. ఫస్ట్ టైం అడుక్కున్నా’ అని ఆ ఫ్రెండ్ అన్నాడు. అక్కడితో ఆగకుండా ‘తిరుపతిలో రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం’ అని మరో కామెంట్ కూడా చేశారామె. అడుక్కున్నా కానీ… బాగుంది అంటూ సోను అన్నాడు.
ఇలా శ్రీవారి ప్రసాదంపై శివజ్యోతి కామెంట్స్ చేయడాన్ని భక్తులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి అన్న ప్రసాదాన్ని, భక్తులను అవమానించారు అని అంటున్నారు. మరి ఈ విషయంలో ఆమె ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.