Suma: గాయాల పాలైన సుమ… అందుకే ఆది పురుష్ ఈవెంట్ కు దూరంగా ఉందా?

సాధారణంగా ఏదైనా సినిమా వేడుక జరుగుతుంది అంటే అక్కడ తప్పకుండా యాంకర్ సుమ ఉండాల్సిందే. మరి ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే తప్పకుండా ఆ కార్యక్రమానికి యాంకర్ గా సుమా వ్యవహరించడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తారన్న భావన అందరిలోనూ ఉంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగిన విషయం మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ (Suma) దూరంగా ఉన్నారు. ఇక సుమ లేకపోవడంతో సీనియర్ యాంకర్ ఝాన్సీ ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించారు. అయితే ఈ కార్యక్రమంలో సుమా లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఈ విధంగా ఈ సినిమా వేడుకకు సుమ ఎందుకు రావడం లేదు అంటూ ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా సుమను ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తను తన ఫ్యామిలీతో కలిసి ఫారెన్ వెకేషన్ లో ఉన్నానని చెప్పుకొచ్చారు..

నిజానికి ఆది పురుష్ ఈవెంట్ నిర్వహించాల్సిన అవకాశం సుమకే వచ్చింది. కానీ తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ ట్రిప్ లో ఉండడం చేత ఈమె ఈ అవకాశం వదులుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇక సుమ వెకేషన్ లో ఉన్నప్పటికీ తన వెకేషన్ కి సంబంధించిన అన్ని ఫోటోలను కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తాజాగా ఈమె ఈ వెకేషన్ లో తీవ్ర గాయాలు పాలయ్యారని తెలుస్తోంది.

షూ తన కాళ్లను బాగా కొరికేయడంతో గాయాలు అయ్యాయని అందుకు ట్రీట్మెంట్ చేయించుకొని కాలి వేళ్లకు ప్లాస్టర్ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలపై స్పందించిన ప్రభాస్ అభిమానులు రామయ్య ఆగ్రహానికి సుమ గురయ్యారని అందుకే ఇలా దెబ్బలు తగిలాయి అంటూ సుమ పై ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus