హీరోగా సుమా కొడుకులు లాంచ్ చేయనున్న డైరెక్టర్.. పోస్టర్ వైరల్!

బుల్లితెరపై యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె పలు సినిమాలలో కూడా నటించారు.ఇకపోతే సుమా దంపతులకు ఇద్దరు పిల్లలు అనే విషయం మనకు తెలిసిందే. వీరిలో అబ్బాయి రోషన్ కనకాల ఇదివరకే శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించిన నిర్మలా కాన్వెంట్ సినిమా ద్వారా వెండి తెరపై సందడి చూశారు.

ఇక రోషన్ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లారు అయితే తన చదువులు పూర్తి కావడంతో ఈయన ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం శిక్షణ కూడా పూర్తి తీసుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈయన హీరోగా మొదటి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రోషన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

అడవి శేష్ హీరోగా నటించిన క్షణం సినిమా అలాగే కృష్ణ అండ్ హిస్ లీల్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ రవికాంత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి రెండు సినిమాలతో మంచి హిట్ అందుకున్న ఈయన సుమ కొడుకు రోషన్ కి కూడా మంచి హిట్ అందిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా మహేశ్వరి మూవీస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ వన్ గా నిర్మితమవుతుంది.

ఇలా ఈ సినిమాలో రోషన్ లుక్ కి సంబంధించిన పోస్టర్ సుమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎట్టకేలకు నీ కల నిజమైంది అంటూ క్యాప్షన్ జోడించారు. ఇందులో రోషన్ డీజేగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇతర తారాగణం వంటి విషయాలను వెల్లడించనున్నారు.మరి యాంకర్ గా సుమ ఇండస్ట్రీలో ఎలా అయితే సక్సెస్ అయ్యారు హీరోగా తన కొడుకు కూడా ఇండస్ట్రీలో అలాగే సక్సెస్ కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus