Anchor Suma: విరామం తీసుకోవాలనుకున్నా… యాంకరింగ్ విషయంలో సుమ షాకింగ్ డిసిషన్!

తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ యాంకర్ ఎవరు అంటే అందరికీ టక్కున సుమా కనకాల గుర్తుకు వస్తారు. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సుమ మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగింటి కోడలుగా అడుగుపెట్టి కెరియర్ మొదట్లో పలు సీరియల్స్ లో నటిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన అనంతరం యాంకర్ గా స్థిరపడ్డారు. ఇలా బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసినటువంటి సుమ ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు.

అయితే గత ఏడాది జయమ్మ పంచాయతీ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈమెకు సినిమాల కన్నా యాంకర్ గానే ఎంతో మంచి గుర్తింపు లభించింది. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా ఏ సినిమా ఈవెంట్ జరిగిన అక్కడ తప్పనిసరిగా సుమ ఉండాల్సిందే.కొంతమంది హీరోలు ఈమె డేట్స్ చూసుకుని వారు ఈవెంట్స్ పెట్టుకుంటారు అంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది.

ఇలా యాంకర్ గా కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి సుమ తాజాగా తన యాంకరింగ్ విషయంలో షాకింగ్ నిర్ణయాన్ని బయటపెట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈటీవీలో వేర్ ఇస్ ద పార్టీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది బుల్లితెర నటీమణులు జబర్దస్త్ కమెడియన్స్ పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ కు సన్మానం కూడా చేశారు.

అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సుమ మాట్లాడుతూ తాను కొంతకాలం పాటు యాంకరింగ్ కు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.అయితే సుమ నిజంగానే నిర్ణయం తీసుకున్నారా లేదా ప్రోమోలో భాగంగా ఇలా కట్ చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus