టాలీవుడ్ స్టార్ యాంకర్లలో వర్షిణి ఒకరు కాగా తక్కువ సినిమాలలోనే నటించినా నటిగా కూడా వర్షిణి గుర్తింపును సంపాదించుకున్నారు. యాంకర్ గా వర్షిణికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. శాకుంతలం సినిమాలో మెరిసిన వర్షిణి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. పలు వెబ్ సిరీస్ లలో నటించిన ఈ బ్యూటీ తాజాగా జాకెట్ లేకుండా దర్శనమిచ్చారు. సోషల్ మీడియా ఖాతాలలో ఒకటైన ఇన్ స్టాగ్రామ్ లో వర్షిణి ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వర్షిణి (Varshini) షేర్ చేసిన ఈ ఫోటోలు శాకుంతలం సినిమాకు సంబంధించిన స్టిల్స్ అని తెలుస్తోంది. వర్షిణి తన అందానికి, టాలెంట్ కు మరో స్టేజ్ లో ఉండాలని కెరీర్ విషయంలో ఆమె జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత సైతం ఈ మధ్య కాలంలో కొన్ని వెబ్ సిరీస్ లలో ఒకింత బోల్డ్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వర్షిణి సైతం సమంతను ఫాలో అవుతున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
శాకుంతలం సినిమా సక్సెస్ సాధించి ఉంటే వర్షిణికి కెరీర్ పరంగా ప్లస్ అయ్యేది. తొలిరోజు ఈ సినిమా కలెక్షన్లు 2.5 కోట్ల రూపాయల లోపే ఉండనుందని తెలుస్తోంది. వర్షిణికి సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన వర్షిణి స్టార్ డైరెక్టర్ల దృష్టిలో పడితే మాత్రం కెరీర్ పరంగా ఆమెకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.
వర్షిణి పారితోషికం కూడా పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. వర్షిణి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కొన్ని సినిమాలలో ఆమెకు గుర్తింపు ఉన్న పాత్రలు దక్కుతుండగా మరికొన్ని సినిమాలలో మాత్రం ఆమెకు మంచి పాత్రలు దక్కడం లేదని తెలుస్తోంది.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!