Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా మహేష్ బాబు.పి దర్శకత్వంలో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమా పీరియాడిక్ మూవీ రూపొందింది. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్ర పోషించారు. మహేష్ బాబు పి దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ మెర్విన్ సంగీతం అందించారు.

Andhra King Taluka

వారి సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇక టీజర్, ట్రైలర్స్ వంటివి వాటికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మొదటి రోజు సినిమాకి మంచి టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ విషయంలో మాత్రం డిజప్పాయింట్ చేసింది అనే చెప్పాలి.మొదటి రోజు సో సో కలెక్షన్స్ ను సాధించిన ఈ సినిమా రెండో రోజు కూడా ఓకే అనే రేంజ్లోనే పెర్ఫార్మ్ చేసింది తప్ప.. కలెక్షన్స్ లో ఇంప్రూవ్మెంట్ ఏమీ చూపించలేదు.

3వ రోజు, 4వ రోజు కూడా అంతే..! ఇక వీక్ డేస్ లో అడుగుపెట్టాక.. మొదటి సోమవారం నాడు ఈ సినిమా కలెక్షన్స్ బాగా తగ్గాయి. కనీసం ఇలాగే స్టడీగా కలెక్ట్ చేస్తే రిజల్ట్ కొంచెం బెటర్ గా ఉండొచ్చు.

ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.77 cr
సీడెడ్ 0.63 cr
ఆంధ్ర(టోటల్) 4.13 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 9.53 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.0 cr
ఓవర్సీస్ 2.07 cr
టోటల్ వరల్డ్ వైడ్ 12.6 కోట్లు(షేర్)

 

‘ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka) చిత్రానికి రూ.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.25.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.12.6 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.12.9 కోట్ల షేర్ ను రాబట్టాలి. టార్గెట్ అయితే ఇంకా చాలా ఉంది. వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేస్తే తప్ప అది సాధ్యం కాదనే చెప్పాలి.

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus