Andhra King Taluka: రామ్ సినిమాకి మంచి రిలీజ్ డేట్ దొరికినట్టే..!
- July 14, 2025 / 03:50 PM ISTByPhani Kumar
రామ్ పోతినేని హీరోగా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ రూపొందుతుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.పి డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ‘కన్నడ’ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మధ్యనే గ్లింప్స్ వచ్చింది. దానికి మంచి స్పందన లభించింది. రామ్ ఈ మధ్య కాలంలో సీరియస్ రోల్స్ చేస్తూ వచ్చాడు.
Andhra King Taluka
అయితే ‘ఆంధ్రా కింగ్..’ గ్లింప్స్ లో హుషారుగా కనిపించాడు. అతని నుండి ప్రేక్షకులు ఆశించేది అదే అని చెప్పడంలో సందేహం లేదు. అలాగే భాగ్య శ్రీ – రామ్ పెయిర్ కూడా చూడటానికి బాగుంది. అందుకే ‘ఆంధ్రా కింగ్..’ పై కొంత బజ్ అయితే ఉంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. వివేక్ మెర్విన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

- 1 Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!
- 2 Senthil: రాజమౌళి – మహేష్ సినిమా వదులుకున్నారా? సెంథిల్ క్లారిటీ ఇదిగో!
- 3 Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!
- 4 Vishnu Vishal, Rajinikanth: రజినీ పాత్ర నిడివి పెంచడం వల్లే నా సినిమా ప్లాప్ అయ్యింది : విష్ణు విశాల్
ఇటీవల ఈ సినిమాని సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్టు టాక్ నడిచింది. ‘ఆంధ్రా కింగ్..’ కోసం మైత్రి వారు డిస్ట్రిబ్యూటర్లకు సెప్టెంబర్ 25 డేట్ చెప్పడంతో.. అది హాట్ టాపిక్ అయ్యింది. కానీ అదే డేట్ కి ‘అఖండ 2’ ‘ఓజి’ వంటి పెద్ద సినిమాలు ఉండటంతో రిస్క్ చేసే ఆలోచనలో చిత్ర బృందం లేదు.

అందుతున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ 17న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు ఆ డేట్ ని లాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 18న దీపావళి పండుగ ఉండటం వల్ల.. ఆ డేట్ కలిసొస్తుంది అని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.













