Andrea Jeremiah: ఆ సినిమా కోసం నగ్నంగా ఆండ్రియా..!

కోలీవుడ్లో సింగర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఆండ్రియా తర్వాత హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. ప్రాముఖ్యత కలిగిన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే..! సునీల్, నాగచైతన్య కలిసి నటించిన ‘తడాఖా’ చిత్రం ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమా కోసం ఓ పాట కూడా పాడింది.

ఇదిలా ఉండగా.. నిజ జీవితంలో ఈ అమ్మడు చాలా బోల్డ్ అని చాలా మంది చెబుతుంటారు. సినిమాల్లో కూడా ఏమైనా బోల్డ్ సీన్స్ లో నటించడానికి ఈమె ఏ మాత్రం వెనుకాడదు.అయితే తాజాగా ఓ సినిమా కోసం ఈమె నగ్నంగా కెమెరా ముందు ఫోజులివ్వడం హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. మిష్కిన్ దర్శకత్వంలో 2016లో వచ్చిన ‘పిశాసు’ సినిమాకి సీక్వల్‌గా‌ ‘పిశాసు-2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.అయితే ఈ సీక్వెల్ లో కథ ప్రకారం ఓ సన్నివేశంలో ఆండ్రియా నగ్నంగా కనిపించాలి.

దీనికి ఆమె ఏమాత్రం వెనుకాడకుండా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.కొంతమంది యూనిట్ సభ్యుల సమక్షంలో ఈ సన్నివేశాలు చిత్రీకరించారట. ఇందుకోసం ఆండ్రియా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసినట్టు కూడా వినికిడి. ముందుగా అనుకున్న పారితోషికం కంటే కూడా 2 రెట్లు ఆండ్రియా డిమాండ్ చేసినట్లు కోలీవుడ్లో జోరుగా చర్చ జరుగుతోంది.ఇక గతంలో ‘గృహం’ అనే హారర్ సినిమాలో కూడా ఈమె ఓ ఇంటిమేట్ సీన్ లో నటించిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus