‘బిగ్ బాస్ 7’.. అతను కన్ఫర్మ్ అనుకుంటే తీసేశారట!

బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 6 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిశాయి. ఇప్పుడు 7 వ సీజన్ కి రంగం సిద్ధమైంది. మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. సెకండ్ సీజన్ కి నాని హోస్ట్ చేయడం జరిగింది. ఇక మూడో సీజన్ నుండి 6వ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు 7 వ సీజన్ కి కూడా రంగం సిద్ధమైంది.

ఈ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్టు ఆల్రెడీ ప్రోమో ద్వారా స్పష్టం చేసింది బిగ్ బాస్ యాజమాన్యం. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ షో కంటెస్టెంట్ల విషయంలో నిత్యం రకరకాల గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి. ఎలాగు బిగ్ బాస్ లో ఫేడౌట్ అయిపోయిన బ్యాచ్ కంటెస్టెంట్ లుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు అనే అపోహ ఉంది. ఒకవేళ ప్రెజెంట్ ఫామ్లో ఉన్న వాళ్ళు ఎంట్రీ ఇచ్చినా..

అది సినిమాల్లో రాణించేవాళ్ళు కాకుండా సింగర్స్, యాంకర్స్ వంటి వారిని తీసుకుంటారు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అదీ కాకుండా కామన్ మెన్ కేటగిరిలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేవాళ్ళు .. 5 లక్షలు ఎంట్రీ ఫీజ్ కట్టి సెలక్ట్ అవుతారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ‘మై విలేజ్ షో’ అనే ఛానల్ తో బాగా ఫేమస్ అయిన అనీల్ గిలానీని తీసేశారట.

ఈ విషయాన్ని స్వయంగా అతనే (Anil Geela) చెప్పుకొచ్చాడు. ‘రైతు కుటుంబం నుండి ఈ స్థాయికి వచ్చిన అతనికి బిగ్ బాస్ ద్వారా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ఛాన్స్ లభిస్తుంది అని భావించాడట. కానీ చివరి నిమిషంలో తీసేసినట్టు’ ఓ పోస్ట్ ద్వారా అతను తెలియజేసినట్టు తెలుస్తుంది. మొన్నటికి మొన్న ‘మొగలు రేకులు’ ఫేమ్ సాగర్ ను కూడా తీసేసినట్టు టాక్ నడిచింది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus