ముద్దు సీన్లలో నటించే ఛాన్స్ రాలేదు.. సీనియర్ హీరో కామెంట్స్!

అరవై ఏళ్ల వయసులో ముద్దు సీన్ల కోసం ఆరాటపడుతున్నాడు బాలీవుడ్ సీనియర్ హీరో అనీల్ కపూర్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మలంగ్’. ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ జంటగా నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఇందులో ఆదిత్య, దిశాల రొమాన్స్ ఎక్కువగా చూపించారు. ఇద్దరి మధ్య ముద్దు సీన్లకు పెద్ద పీట వేశారు. ఈ క్రమంలో ఓ విలేకరి అనీల్ కపూర్ ని ‘సినిమాలో మీకు ముద్దు సీన్లలో నటించే ఛాన్స్ రాలేదని ఫీల్ అవుతున్నారా..?’ అని ప్రశ్నించాడు. దానికి అనీల్.. ‘ఇంట్లో నా కూతుళ్లు, భార్య ఉన్నారు.. ఈ ప్రశ్నలు అడిగి నన్ను వారితో కొట్టించాలని అనుకుంటున్నారా..?’ అని సరదాగా స్పందించాడు.

Anil Kapoor Funny Reaction on Disha Patani Aditya Roy Kapoor Kiss1

అనంతరం తనకు కిస్సింగ్ సీన్స్ లో నటించే ఛాన్స్ రానందున బాధగానే ఉందని.. సినిమాలో ఆదిత్య, దిశా బైక్ రైడ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తారని.. తను కుర్రాడిని అయితే వారిలానే ఎంజాయ్ చేసేవాడినని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో అనీల్ కపూర్ పోలీస్ గా కనిపించే విలన్ పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus