అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నాడు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ..”వాస్తవానికి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ స్క్రిప్ట్ లో మొదట వెంకటేష్ గారి కేమియో లేదు. కానీ చిరంజీవి గారు స్క్రిప్ట్..లో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఓ కేమియో ఉంటే బాగుంటుంది అన్నారు.
తర్వాత వెంకటేష్ గారి కేమియో కోసం స్క్రిప్ట్ లో ఇంకొన్ని సీన్స్ యాడ్ చేశాం” అంటూ చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. మొన్నామధ్య వెంకటేష్ కేమియో ఈ సినిమాలో 25 మినిట్స్ వరకు ఉంటుంది.. ఇద్దరి కాంబినేషన్లో సాంగ్ కూడా ఉంటుంది.. ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ గ్యారెంటీ” అంటూ చెప్పుకొచ్చాడు.

అనిల్ కామెంట్స్ పై కొన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో..చిరంజీవి ‘ఆచార్య’ విషయంలో కూడా ఇలానే చరణ్ కేమియోని బలవంతంగా పెట్టించారు. 15 నిమిషాల కేమియోని 45 నిమిషాల వరకు పొడిగించారు. అది సినిమా కథలో సింక్ అవ్వలేదు. చరణ్ కూడా ఆ పాత్రకి ఫిట్ అవ్వలేదు. అందుకే ఇప్పుడు ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ విషయంలో అటు వెంకటేష్ ఫ్యాన్స్.. ఇటు చిరంజీవి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
అయితే వెంకటేష్ కి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్.. ఈ సినిమాకి కలిసొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఈ కేమియో కనుక కరెక్ట్ గా వర్కౌట్ అయితే.. బాక్సాఫీస్ వద్ద సినిమాకి మరింత హెల్ప్ అవ్వడం ఖాయం. చూద్దాం ఏమవుతుందో
